Manipur Latest clashes: మణిపూర్‌లో తాజా ఘర్షణలు.. 9 మంది మృతి.. 10 మందికి గాయాలు
మణిపూర్‌లో తాజాగా జరిగిన ఘర్షణల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో పదిమంది గాయపడ్డారు. మైటీల ప్రాబల్యం ఉన్న ఇంఫాల్ తూర్పు జిల్లా మరియు గిరిజనులు అధికంగా ఉండే కాంగ్‌పోక్పి జిల్లా సరిహద్దుల వెంబడి కాల్పులు జరిగాయి.హింసలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Manipur Latest clashes: మణిపూర్‌లో తాజాగా జరిగిన ఘర్షణల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో పదిమంది గాయపడ్డారు. మైటీల ప్రాబల్యం ఉన్న ఇంఫాల్ తూర్పు జిల్లా మరియు గిరిజనులు అధికంగా ఉండే కాంగ్‌పోక్పి జిల్లా సరిహద్దుల వెంబడి కాల్పులు జరిగాయి.హింసలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఖమెన్‌లోక్ గ్రామంలో అనేక ఇళ్లను కూడా దుండగులు తగలబెట్టారని నివేదికలు తెలిపాయి.తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో, ఇంఫాల్ తూర్పు జిల్లా మరియు కాంగ్‌పోకి జిల్లా సరిహద్దులో ఉన్న ఖమెలోక్ ప్రాంతంలోని గ్రామస్తులను అధునాతన ఆయుధాలతో చుట్టుముట్టిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
కర్ఫ్యూ సడలింపులు తగ్గింపు..(Manipur Latest clashes)
ఇంఫాల్‌లో కర్ఫ్యూ సడలింపులు తగ్గించారు. ఇప్పుడు ఉదయం 5 నుండి ఉదయం 9 గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయి.మంగళవారం బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగక్‌చావో ఇఖాయ్‌లో కుకీ ఉగ్రవాదులతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపినట్లు వారు తెలిపారు. కుకీ మిలిటెంట్లు మైటీ ప్రాంతాలకు దగ్గరగా బంకర్లను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి.
ఒక నెల క్రితం మణిపూర్‌లో మైటీ మరియు కుకీ వర్గాల మధ్య జరిగిన జాతి హింసలో కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోగా 310 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ఆర్మీ, పారా మిలటరీ సిబ్బందిని రంగంలోకి దించారు.
ఇవి కూడా చదవండి:
- Pawan Kalyan Varahi Yatra : నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ ప్రారంభం.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ !
- Drugs Case : డ్రగ్స్ కేసులో రజినీకాంత్ “కబాలి” మూవీ ప్రొడ్యూసర్ అరెస్ట్..