Last Updated:

Prime Minister Modi: 70 వేల మందికి నియామకపత్రాలు అందజేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ 70 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ ఫెయిర్ కింద వీరిని ఎంపిక చేశారు. నేటి ఉదయం పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన దాదాపు 70వేల మందికి ప్రధాని అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందించారు.

Prime Minister Modi: 70 వేల మందికి నియామకపత్రాలు అందజేసిన ప్రధాని మోదీ

Prime Minister Modi: ప్రధాని నరేంద్ర మోదీ 70 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ ఫెయిర్ కింద వీరిని ఎంపిక చేశారు. నేటి ఉదయం పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన దాదాపు 70వేల మందికి ప్రధాని అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందించారు.

ముద్రా యోజనతో కోట్లాది మందికి సాయం..(Prime Minister Modi)

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలు ఎన్‌డిఎ, బిజెపి ప్రభుత్వానికి కొత్త గుర్తింపుగా మారాయన్నారు. బీజేపీ పాలిత ప్రభుత్వాలు కూడా ఇలాంటి జాబ్ మేళాలను నిరంతరం నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు ప్రధాని. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలలో చేరి వారికి ఇది అత్యంత కీలకమైన సమయం. రాబోయే పాతికేళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు ప్రధాని. ముద్రా యోజన కోట్లాది మంది యువతకు తమ ప్రభుత్వం సహాయం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్-అప్ ఇండియా వంటి ప్రచారాలు యువత సామర్థ్యాన్ని మరింతగా పెంచాయి. ప్రభుత్వం నుంచి సహాయం పొందిన ఈ యువకులు ఇప్పుడు చాలా మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నారని ప్రశంసించారు ప్రధాని మోదీ.

అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా గత ప్రభుత్వాలు..

రాజకీయ అవినీతికి గత ప్రభుత్వాలు కేరాఫ్ అడ్రస్‌గా మారాయని కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శించారు ప్రధాని మోదీ. వచ్చే 25 ఏళ్లలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. ప్రపంచం మొత్తం భారత్‌ను విశ్వసిస్తోంది. అన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళుతోందన్నారు మోదీ. దేశంలో జరుగుతున్న ఈ ఉపాధి ప్రచారం కూడా పారదర్శకత, సుపరిపాలనకు నిదర్శనమని ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి ప్రధాని అన్నారు. మన దేశంలో కుటుంబ ఆధారిత రాజకీయ పార్టీలు.. ప్రతి వ్యవస్థలోనూ ఆశ్రిత పక్షపాతాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నాయో మనం చూశాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా బంధుప్రీతి, అవినీతికి పాల్పడేవారు. ఈ పార్టీలు కోట్లాది మంది దేశ ప్రజలకు ద్రోహం చేశాయి. తమ ప్రభుత్వం అన్నీ రంగాల్లో పారదర్శకతను తీసుకొచ్చింది. ఆశ్రిత పక్షపాతాన్ని అంతం చేసామన్నారు ప్రధాని .

కొత్తగా నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులు రాబోయే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యాన్ని మరింత వేగంగా తీసుకువెళతారని ఆశిస్తున్నానన్నారు ప్రధాని. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలు కల్పించింది మోదీ సర్కార్‌. గత ఐదు ఉపాధి మేళాల్లో ఇప్పటి వరకు 4.29 లక్షల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. జూన్ 13వ తేదీ మంగళవారం దేశంలోని 43 చోట్ల ఉపాధి మేళాలు నిర్వహించారు.