Last Updated:

Sachin Pilot comments: అవినీతిపై ఒక్కరోజు నిరాహారదీక్ష చేస్తాను.. రాజస్దాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కామెంట్స్

రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకుమందు అధికార కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ అవినీతికి వ్యతిరేకంగా తాను మంగళవారం ఒక రోజు నిరాహారదీక్ష చేస్తానని చెప్పారు. వసుంధర రాజే నేతృత్వంలోని గత బిజెపి ప్రభుత్వం చేసిన అవినీతికి వ్యతిరేకంగా గెహ్లాట్ ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Sachin Pilot comments:  అవినీతిపై ఒక్కరోజు నిరాహారదీక్ష చేస్తాను.. రాజస్దాన్  మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్  కామెంట్స్

Sachin Pilot comments: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకుమందు అధికార కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ అవినీతికి వ్యతిరేకంగా తాను మంగళవారం ఒక రోజు నిరాహారదీక్ష చేస్తానని చెప్పారు. వసుంధర రాజే నేతృత్వంలోని గత బిజెపి ప్రభుత్వం చేసిన అవినీతికి వ్యతిరేకంగా గెహ్లాట్ ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అవినితిపై చర్యలు తీసుకోవడంలో విఫలం..(Sachin Pilot comments)

2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రకటనలు మరియు వాగ్దానాలకు కట్టుబడి ఉందని ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందనిపైలట్ అన్నారు. ఎక్సైజ్ మాఫియా, అక్రమ మైనింగ్, భూ ఆక్రమణలు, లలిత్ మోదీ అఫిడవిట్ కేసులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ సీఎం గెహ్లాట్ ను పరోక్షంగా టార్గెట్ చేసారు. ఈ హామీలను నెరవేర్చకపోవడంతో మేం ఎన్నికలకు వెళ్లలేం.. మా దగ్గర ఆధారాలున్నాయి. చర్యలు తీసుకోవాలి. విచారణ చేయాలి. ఎన్నికలకు వెళ్తున్నాం. త్వరలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లోకి వస్తుంది.. ప్రజలకు మేం జవాబుదారీగా ఉంటామని పైలట్ తెలిపారు.

సీఎంకు లేఖలు రాసినా సమాధానం లేదు..

మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా పోరాడాము, దాని వల్ల మేము అధికారంలోకి వచ్చాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వసుంధర రాజే ప్రభుత్వ హయాంలో మేము అనేక అవినీతి సమస్యలను లేవనెత్తాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలపై చర్య తీసుకున్నప్పుడే మా విశ్వసనీయత ఉంటుంది.నేను మార్చి 28, 2022న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు లేఖలు రాశాను. అయితే, నాకు ఎలాంటి సమాధానం రాలేదు. మైనింగ్ మాఫియాకు సంబంధించిన అవినీతి కేసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2022 నవంబర్ 2న మళ్లీ లేఖ రాశాను అని పైలట్ విలేకరుల సమావేశంలో అన్నారు.రాజస్థాన్‌లో వ్యవహారాల గురించి పార్టీ నాయకత్వానికి తాను చాలా సూచనలు ఇచ్చానని, వాటిలో ఒకటి ఈ సమస్యలపై చర్య తీసుకోవాలని పైలట్ చెప్పారు. ఇది మా ప్రభుత్వం, మేము చర్య తీసుకోవాలని ఆయన అన్నారు.

2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలిచినప్పుడు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకుంటారని కాంగ్రెస్  హై కమాండ్ చెప్పింది. అయితే అది నెరవేరలేదు. గెహ్లాట్ సీఎంగా కొనసాగారు. దీనితో రెండేళ్ళ తర్వాత, 2020లో, మిస్టర్ పైలట్ ఢిల్లీకి సమీపంలోని రిసార్ట్‌లో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహించారు. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు గెహ్లాట్ వైపు నిలవడం, ప్రియాంక గాంధీ మద్యవర్తిత్వంతో సచిన్ పైలట్ తన తిరుగుబాటును విరమించుకున్నారు.