Upcoming Hybrid SUVs: సూపర్ హైబ్రిడ్ కార్లు.. స్టన్నింగ్ లుక్స్, ఆకర్షించే ఫీచర్లతో వచ్చేస్తున్నాయ్..!

Upcoming Hybrid SUVs: చాలా రోజులుగా భారతీయ కస్టమర్లలో హైబ్రిడ్ కార్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మారుతీ నుంచి టయోటా వంటి ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు రానున్న రోజుల్లో తమ అనేక హైబ్రిడ్ మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో నడిచే కార్లు మెరుగైన మైలేజీని అందిస్తాయి. ఇది వినియోగదారుల జేబులపై తక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి అటువంటి రాబోయే 5 హైబ్రిడ్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Honda ZR-V Hybrid
హోండా ఇటీవల భారతదేశంలో జరిగిన డీలర్ ఈవెంట్‌లో ZR-V హైబ్రిడ్‌ను ఆవిష్కరించింది. గ్లోబల్ మార్కెట్‌లో SUV 2.0-లీటర్ 4-సిలిండర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 181బిహెచ్‌పి పవర్‌ట్రెయిన్, 315ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
Kia Seltos Facelift
కియా తన పాపులర్ ఎస్‌యూవీ సెల్టోస్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ భారతీయ మార్కెట్లో చాలాసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. మీడియా నివేదికల ప్రకారం, సెల్టోస్‌లో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించవచ్చు. ఇది కాకుండా ఎస్‌యూవీ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో కూడా మార్పులు కనిపిస్తాయి.
Toyota Fortuner Mild-Hybrid
టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్-హైబ్రిడ్ వెర్షన్ 2.8L GD డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఎస్‌యూవీ ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ దీనిని భారతదేశంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Hyundai Creta Hybrid
హ్యుందాయ్ దాని ఫేమస్ ఎస్‌యూవీక్రెటాకు ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, దీనిని హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం హ్యుందాయ్ రాబోయే కొన్నేళ్లలో క్రెటా హైబ్రిడ్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.
Maruti Suzuki Fronx Hybrid
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇటీవల హైబ్రిడ్ బ్యాడ్జ్‌లతో పరీక్షిస్తున్నట్లు గుర్తించారు. దాని లాంచ్ గురించి అంచనాలు పెరిగాయి. అయితే దీని గురించి మరింత సమాచారం త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- Bajaj Affordable New Electric Scooter: బజాజ్ మరో సంచలనం.. పేద, మధ్య తరగతి ప్రజల కోసం త్వరలో కొత్త స్కూటర్..!