Agent OTT Streaming: సర్‌ప్రైజ్.. ఒక్క రోజు ముందే స్ట్రీమింగ్‌కి వచ్చేసిన ‘ఏజెంట్’ – ఎక్కడ చూడాలంటే..

Akhil Agent Movie Now Streaming on OTT: రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. అక్కినేని ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ విడుదలై రెండేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా ఓటీటీకి రాలేదు. ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. తరచూ వాయిదా పడుతుండటంతో మూవీ లవర్స్‌కి నిరాశే ఎదురైంది. దీంతో ఎట్టకేలకు ఈ ఏడాది మూవీని ఓటీటీలోకి తీసుకువస్తున్నట్టు ఇటీవల అధికారిక ప్రకటన ఇచ్చారు. హోలి పండుగ సందర్భంగా అభిమానుల కోసం అయ్యాగారి మూవీని స్ట్రీమింగ్‌కి తీసుకువస్తున్న సోనీలివ్ అధికారిక ప్రకటన ఇచ్చింది.
ఒక్క రోజు ముందే ఓటీటీకి
అయితే ఇప్పుడు ఫ్యాన్స్‌ని మరింత సర్‌ప్రైజ్ చేసేందుకు ఒక్క రోజు ముందే ఏజెంట్‌ని మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకువచ్చింది సోనీలివ్. శుక్రవారం విడుదల కావాల్సిన ఈ సినిమాను గురువారం సాయంత్రం నుంచి స్ట్రీమింగ్‌కి ఇచ్చింది. దీంతో ఏజెంట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఇది డబుల్ సర్‌ప్రైజ్ అందిస్తోంది. ఇటూ హోలీ అటూ రెండేళ్ల తర్వాత ఏజెంట్ ఓటీటీకి రావడంతో ఫ్యాన్స్ సంబరాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం ఏజెంట్ సోనీలివ్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళంచ కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్ లో డిజాస్టర్
కాగా అఖిల్ హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ మూవీని తెరకెక్కించారు. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా.. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. ఇందులో అఖిల్ ఏజెంట్‌గా కనిపించారు. ఈ సినిమా ప్రత్యేకంగా కసరత్తులు చేశాడు అఖిల్. జిమ్‌లో కష్టపడుతూ బీస్ట్ మోడ్‌లోకి వచ్చాడు. ఏజెంట్ కోసం మేకోవర్ అవ్వడానికి ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. ఇందులో అఖిల్ లుక్, మూవీ ప్రమోషన్స్ చూసి ఏజెంట్ బ్లాక్‌బస్టర్ హిట్ అని అంతా అభిప్రాయపడ్డారు.
అలా ఎన్నో అంచనాల మధ్య 2023 మార్చి 14న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేకపోయింది. ఈ సినిమా కథ, కథనం బలహీనంగా ఉందని, ఆశించిన స్థాయిలో లేదని అభిమానులంత డిసప్పాయింట్ అయ్యారు. దీంతో మూవీ ఫస్ట్ డేనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఎంతో కాలంగా ఓ భారీ హిట్ కోసం ఎదురు చూసిన అఖిల్‌కి ఏజెంట్‌పై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. చివరికి ఈ సినిమా కూడా అతడి నిరాశ పరిచింది.