Samsung Galaxy S24 Plus 5G Discounts: రూ. లక్ష ఫోన్ రూ.20 వేలకే.. ఈ సామ్‌సంగ్ 5జీ ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్..!

Samsung Galaxy S24 Plus 5G Discounts: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ కంపెనీకి చెందిన ‘Samsung Galaxy S24 Plus’ పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు మీరు రూ. 1 లక్ష విలువైన ఫోన్‌ను రూ.20 వేల కంటే తక్కువకు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. బహుశా మీరు నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం.హోలీ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది.
Samsung Galaxy S24 Plus 5G Offers
సామ్‌సంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5జీ 256GB వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 99,999 ధరతో జాబితా చేశారు. అయితే దాదాపు రూ.20 వేలకు మాత్రమే కొనుగోలు చేయచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఈ ఫోన్‌పై వినియోగదారులకు 43శాతం భారీ తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది. వెబ్‌సైట్ నుండి ఈ ఆఫర్ తర్వాత, ఈ రూ.లక్ష ఫోన్ ధర రూ.56,999 మాత్రమే. అయితే, ఈ ఆఫర్ తర్వాత కూడా, మీరు దీన్ని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
సామ్‌సంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5జీపై ఫ్లిప్‌కార్ట్ 5శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీని ప్రయోజనాన్ని పొందడానికి, మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేయాలి. దీని తర్వాత, మీరు IDFC బ్యాంక్ కార్డ్‌లో రూ. 750 వరకు ఆదా చేసుకునే అవకాశం కూడా ఉంది. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను నెలవారీ EMI రూ.9,500తో కొనుగోలు చేయచ్చు.
సామ్‌సంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5Gపై ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిన అతిపెద్ద ఆఫర్ గురించి మాట్లాడుతూ, కంపెనీ రూ. 52,250 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్లలో భారీగా డబ్బు ఆదా చేసుకోవచ్చు. మీ పాత ఫోన్‌కు రూ.35 వేలు ఎక్సేంజ్ వాల్యూ వస్తే.. కేవలం రూ.22 వేలకే కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లొచ్చు.
Samsung Galaxy S24 Plus 5G Features
కంపెనీ Samsung Galaxy S24 Plus 5Gలో అల్యూమినియం ఫ్రేమ్ డిజైన్ చేసింది. అలానే IP68 రేటింగ్ ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ 6.7 అంగుళాల డైనమిక్ LTPO AMOLED స్క్రీన్‌ను అందించారు, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14లో రన్ అవుతుంది. మీరు దీన్ని కూడా అప్‌గ్రేడ్ చేయచ్చు.
ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజ్ ఇందులో చూడచ్చు. ఫోటోగ్రఫీ కోసం, ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో 50+10+12 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. బ్యాకప్ కోసం 4900mAh బ్యాటరీ ఉంటుంది.