Last Updated:

Deepak Shenoy: కోవిడ్ ముగిసింది.. ఫ్రీ రేషన్ అవసరం లేదు.. క్యాపిటల్‌ మైండ్ సీఈవో దీపక్ షెనాయ్

కేంద్రం ఉచిత రేషన్ పథకాన్ని మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు చేసిన ప్రకటన పై క్యాపిటల్‌ మైండ్ వ్యవస్థాపకుడు మరియు సీఈవో దీపక్ షెనాయ్ స్పందించారు. ఇది "చెడు నిర్ణయం". కోవిడ్ ముగిసినందున ఉచితంగా ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Deepak Shenoy: కోవిడ్ ముగిసింది.. ఫ్రీ రేషన్ అవసరం లేదు.. క్యాపిటల్‌ మైండ్ సీఈవో దీపక్ షెనాయ్

Free Ration Scheme: కేంద్రం ఉచిత రేషన్ పథకాన్ని మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు చేసిన ప్రకటన పై క్యాపిటల్‌మైండ్ వ్యవస్థాపకుడు మరియు సీఈవో దీపక్ షెనాయ్ స్పందించారు. ఇది “చెడు నిర్ణయం”. కోవిడ్ ముగిసినందున ఉచితంగా ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

“ఇది చెడ్డ నిర్ణయం. రేషన్ చౌకగా లభించే ఆహారం. ఉచిత ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కోవిడ్ ముగిసింది” అని దీపక్ షెనాయ్ ట్వీట్ చేశారు. పండుగ సీజన్‌లో ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు, బిజెపికి చెందిన సువేందు అధికారి చేసిన ట్వీట్‌ పై ఆయన స్పందించారు. దీనితో ప్రభుత్వం “అనవసరంంగా రూ. 44,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని షెనాయ్ చెప్పారు.

గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలకు ముందుప్రభుత్వం బుధవారం నాడు పేదలకు 44,762 కోట్ల రూపాయల ఖర్చుతో ఉచిత రేషన్ అందించే కార్యక్రమాన్ని మూడు నెలల పాటు పొడిగించింది. 80 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా 5 కిలోల గోధుమలు మరియు బియ్యం ఉచితంగా అందించే పథకం శుక్రవారం (సెప్టెంబర్ 30)తో ముగుస్తుంది. ఇప్పుడు డిసెంబర్ 31, 2022 వరకు అమలులో ఉంటుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద అందించే ఉచిత రేషన్ పథకాన్ని 3 నెలల పాటు పొడిగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పండుగల సీజన్‌లో ఇది ఖచ్చితంగా మన తోటి పౌరులను ఆనందించేలా చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటూ సువేందు అధికారి ట్వీట్ చేసారు.

ఇవి కూడా చదవండి: