Last Updated:

One Nation, One time: కీలక నిర్ణయం.. ఒకే దేశం, ఒకే సమయంపై కొత్త ముసాయిదా నిబంధనలు రిలీజ్

One Nation, One time: కీలక నిర్ణయం.. ఒకే దేశం, ఒకే సమయంపై కొత్త ముసాయిదా నిబంధనలు రిలీజ్

Government drafts rules for mandatory adoption of Indian Standard time: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యకలాపాలు ఒకే ప్రామాణిక సమయంలో నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయం వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నిబంధనలు రూపొందించింది. ఇందులో అధికారిక ప్రభుత్వ విధులతో పాటు దేశాభివృద్ధికి దోహదపడే కీలక వాణిజ్య కార్యకలాపాలు కూడా ఉన్నాయి.

అయితే, ఈ ముసాయిదా నిబంధనలపై ఫిబ్రవరి 14లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇందుకోసం తూనికలు కొలతలు నిబంధనలు, 2024లో చట్టపరమైన విధివిధానాలు ఏర్పాటు చేశారు. వాణిజ్యం, పరిపాలన, రవాణా, చట్టపరమైన ఒప్పందాలు, ఆర్ధిక కార్యకలాపాలతో పాటు వివిధ రంగాల్లో దేశ వ్యాప్తంగా భారతీయ ప్రామాణిక సమయాన్ని అనుసరించాలని ముసాయిదా నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా మొత్తం ఒకే సమయం వర్తింపజేసేందుకు ఈ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు ఇచ్చింది. అంటే.. కాశ్మీ టూ కన్యకుమారి ఎక్కడైనా ప్రతి చోట ఒకే సమయం పాటించేలా నిర్ణయం తీసుకుంది. దీంతో వేరొక సమయం మండలిని అనుసరించేందుకు అవకాశం ఉండదు. అంతేకాకుండా అధికారిక పత్రాల్లోనూ ఐఎస్టీ తప్పనిసరిగా మారింది. దీంతో ఐఎస్టీ కాకుండా ఇతర సమయాలను ప్రస్తావించడం నిషేధించింది. ఇందులో అంతరిక్షం, సముద్రయానం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, దేశంలో వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానం అమలులో ఉండగానే కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్.. వనే టైమ్ విధానంపై దృష్టి సారించింది. దీనిని అమలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ఫిబ్రవరి 14 వరకు గడువు విధించింది. దేశ వ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన అభిప్రాయాల ప్రకారం.. మార్పులతో పాటు అమలుకు నోచుకోనుంది.