Tejashwi Yadav: తేజస్వి యాదవ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో సీబీఐ పిటిషన్
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్ సి టిసి ) కుంభకోణంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టును శనివారం ఆశ్రయించింది. ఒక ప్రైవేట్ సంస్థకు రెండు ఐఆర్ సి టి సి హోటళ్ల నిర్వహణ ఒప్పందాల మంజూరు కేసులో తేజస్వి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోరింది.
Tejashwi Yadav: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్ సి టిసి ) కుంభకోణంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టును శనివారం ఆశ్రయించింది. ఒక ప్రైవేట్ సంస్థకు రెండు ఐఆర్ సి టి సి హోటళ్ల నిర్వహణ ఒప్పందాల మంజూరు కేసులో తేజస్వి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోరింది.
తేజస్వి సీబీఐ అధికారులను బెదిరించారని, తద్వారా బెయిల్ షరతులను ధిక్కరించే విధంగా కేసును ప్రభావితం చేశారని రోస్ అవెన్యూ కోర్టులో సిబిఐ తన దరఖాస్తులో పేర్కొంది. ఈ దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్, తేజస్వికి నోటీసు జారీ చేసారు.
జూలై 2017లో ఐఆర్ సి టి సి హోటల్ కుంభకోణంలో మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, రాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మరియు 11 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో నేరపూరిత కుట్ర (120-బి), ఐపిసి కింద మోసం (420) మరియు అవినీతి ఆరోపణలు ఉన్నాయని సీబీఐ తెలిపింది.