Last Updated:

Rahul Gandhi Flying kiss: రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్‌పై పార్లమెంట్‌లో ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీలు

కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఎంపి శోభా కరంద్లాజే మరియు ఇతర పార్టీ మహిళా సభ్యులు రాహుల్ గాంధీపై బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. సభలోని మహిళా సభ్యుల గౌరవాన్ని అవమానించడమే కాకుండా, ఈ సభ గౌరవాన్ని దిగజార్చడమే కాకుండా సభ్యుని ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

Rahul Gandhi Flying kiss: రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్‌పై  పార్లమెంట్‌లో ఫిర్యాదు చేసిన  బీజేపీ ఎంపీలు

Rahul Gandhi Flying kiss: కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఎంపి శోభా కరంద్లాజే మరియు ఇతర పార్టీ మహిళా సభ్యులు రాహుల్ గాంధీపై బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. సభలోని మహిళా సభ్యుల గౌరవాన్ని అవమానించడమే కాకుండా, ఈ సభ గౌరవాన్ని దిగజార్చడమే కాకుండా సభ్యుని ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ స్త్రీ ద్వేషి..(Rahul Gandhi Flying kiss)

పార్లమెంట్‌లో తొలి ప్రసంగం చేసిన రాహుల్‌ గాంధీ బీజేపీ ఎంపీలకు ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారు. లోక్‌సభ ప్రాంగణం నుంచి వెడుతున్నసమయంలో, స్మృతి ఇరానీ ప్రసంగం కొనసాగుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది.ఫ్లయింగ్ కిస్ విషయంలో రాహుల్ గాంధీపై విరుచుకుపడిన కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆయన్ను స్త్రీ ద్వేషి అని, ఇది అసభ్యకర చర్య అని అన్నారు. పార్లమెంటులో మహిళా ఎంపీలకు స్త్రీ ద్వేషం ఉన్న పురుషుడు మాత్రమే ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలడు. ఇలాంటి సందర్భం మునుపెన్నడూ చూడలేదు. ఇది అతను మహిళల గురించి ఏమనుకుంటున్నాడో తెలియజేస్తుంది. ఇది అసభ్యకరం అని ఆమె అన్నారు.