Home / తప్పక చదవాలి
సీబీఐ మాజీ జేడీ ,జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మినారాయణ తన ప్రాణానికి ప్రమాదం ఉందని విశాఖ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. తాజా ఎన్నికల్లో జేడీ లక్ష్మినారాయణ జై భారత్ నేషనల్ పార్టీ తరుపున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.జేడీ లక్ష్మినారాయణ అసలు పేరు వాసగిరి వెంకట లక్ష్మినారాయణ కానీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా వున్నప్పుడు జగన్ ను ,గాలి జనార్దన్ రెడ్డి లను అరెస్ట్ చేయడం తో తన హోదా తో జేడీ లక్ష్మినారాయణ అనే పేరు బాగా పాపులర్ అయింది.
రాజకీయాల్లో ఏదైనా సంభవమే అన్నట్లు ,ఎన్నికల్లో ఒక వేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న చాలామందిలో కలుగుతుంది .దీనిపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస రచయిత శివ్ ఖేరా సుప్రీంకోర్టు లో పిల్ వేశారు .ఎన్నికల్లో నోటా కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు . దీనిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. ఈ అంశంపై భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
వచ్చే నెల బ్యాంకు ఉద్యోగులకు సెలవులే.. సెలవులు. మొత్తానికి చూస్తే ఆయా రాష్ర్టాల్లో జాతీయ, ప్రాంతీయ సెలవులు కలుపుకొని సుమారు 14 రోజుల పాటు సెలవులు లభిస్తాయి. వాటిలో నాలుగవ శనివారాలతో పాటు ఆదివారాలు కూడా కలుపుకొని ఉన్నాయి. కాగా రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా మే నెల సెలవుల జాబితాను విడుదల చేసింది.
విశాఖ రైల్వే జోన్ వ్యవహారం మరో సారి తెరపైకి వచ్చింది .విభజన హామీలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనీ కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే .అయితే ఇప్పటి వరుకు దీనిపైనా ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు .ఈ క్రమం లో ఇటు కేంద్రం అటు రాష్ట్రం ఒకరు పై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి.
దేశవ్యాప్తంగా రెండో దశ లోకసభ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓటు వేయడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే త్రిపురలోని మారుమూల ప్రాంతమైన దాలాయి జిల్లాను చెప్పుకోవచ్చు. ఇక్కడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బోటు ద్వారా ప్రయాణం చేసి ఓటు వేసి రావాల్సిందే.
ఎన్నికల వేళ గుంటూరు జిల్లా వైసీపీ కి షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన ఆ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీ క్రియాశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖను సీఎం జగన్‌కు పంపారు.
ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కు పెద్ద షాక్ తగిలింది. తుని నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. యనమల రామకృష్ణుడు సోదరుడు ,టీడీపీ నేత యనమల కృష్ణుడు.. టీడీపీకి రాజనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తుని టికెట్ విషయంలో సోదరులిద్దరికి విభేదాలు పొడచుపాయి. తునిలో యనమల రామకృష్ణుడు ఆరుసార్లు గెలవడానికి సోదరుడు కృష్ణుడే కీలక పాత్ర పోషించాడని స్థానికులు చెబుతున్నారు .
దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ సందడి నెలకొంది. ఇక కర్ణాటకలోని బెంగళూరు విషయానికి వస్తే ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ ఆర్ నారాయణమూర్తి, ఆయన బార్య రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి, ఇండియన్ క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్‌లు శుక్రవారం పోలింగ్ ప్రారంభమైన వెంటనే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బుర్కినా ఫాసోలో మిలిటరీ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు గ్రామాల్లో సుమారు 223 మందని దారుణంగా చంపారని మానవ హక్కు గ్రూపు తాజాగా ఒక నివేదికలో వెల్లడించింది. ఈ సామూహిక హత్యలు ఫిబ్రవరి 25 నోన్‌డిన్, సోరో గ్రామాల్లో జరిగాయని గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు ఆయన భార్య బుష్రాబీబీ పలు కేసుల్లో జైల్లో ఉన్నారు. అయితే ఖాన్ భార్య బుష్రా బీబీకి జైల్లో ఆహరంలో టాయిలెట్ క్లీనర్ కలిపి ఇస్తున్నారని ఆమె అధికారి ప్రతినిధి ఆరోపించారు. అయితే దీనిపై కోర్టు మెడికల్ టెస్ట్‌లు జరిపించాలని ఆదేశించినా జైలు అధికారులు మాత్రం పట్టించుకోలేదని ఆమె అధికార ప్రతినిధి మషాల్ యుసుఫ్‌జాయ్ చెప్పారు.