Home / తప్పక చదవాలి
టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. త్రినయని సీరియల్ ఫేం పవిత్ర జయరామ్.. చనిపోయిన ఐదు రోజులకే తన ప్రియుడు, సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో చందు సూసైడ్ చేసుకుని చనిపోయాడు.
భారతీయ జనతాపార్టీ అబ్ కీ బార్ 400 పార్ అంటూ ఎన్నికలకు ముందు ఈ నినాదం హోరెత్తించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి అమిత్ షా వరకు దేశంలోని ప్రతి బీజేపీ కార్యకర్త అబ్ కీ బార్ 400 పార్ నినాదాన్ని తలెత్తుకున్నాడు. అయితే ప్రారంభంలో ఉన్న జోష్ ఇప్పుడు మాత్రం కనపడ్డం లేదు
ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించి ఓట్లు దండుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక జాతీయ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల సందర్భంగా ఇచ్చే తాయిలాల గురించి పలు ప్రశ్నలు సంధించారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పరిధిలోని కందులవారిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల్లో తగాదాలు రావడంతో కుమారుడు తల్లి అంతక్రియలను ఆపేశారు. పెద్దఖర్మ ఖర్చుపై పంచాయతీ తేలితేనే తలకోరివి పెడతానని కొడుకు పట్టుబట్టడంతో మృతదేహం ఫ్రీజర్‌లోనే ఉండిపోయింది.
ఎట్టకేలకు ఆరెంజ్ ఆర్మీ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. మూడేళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరింది.
నెల రోజుల నుంచి కొనసాగుతున్న గంగవరం పోర్టు కార్మికుల సమ్మె ఒక కొలిక్కి వచ్చింది. కార్మికులు శుక్రవారం నుంచి విధుల్లోకి వెళ్ళుతున్నారు . తమ జీతాలు పెంచాలని పోర్ట్ లోని నిర్వాసిత కార్మికులు ఏప్రిల్ 15 న సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే
అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన జేపీ మోర్గాన్స్, సిటి బ్యాంకులాంటి అతి పెద్ద బ్యాంకులు ఇండియాకు కూడా కావాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం శుక్రవారం చెప్పారు. ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ముంబైలో గత సోమవారం సాయంత్రం ఘాట్కోపర్ ప్రాంతంలో అతి పెద్ద హోర్డింగ్ కూలి సుమారు 16 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ముంబై పోలీసులు అడ్వర్టజింగ్ ఏజెన్సీ డైరెక్టర్ భావేష్ భిండేను గురువారం నాడు ఉదయ్‌పూర్‌లో అరెస్టు చేశారు. ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ హోర్డింగ్ కాంట్రాక్టు దక్కించుకుంది.
ఉన్నత విద్యకు కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థులను తిరిగి వెనక్కిపంపేందుకు కెనడా ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రాంతంలో విద్యార్థులు శుక్రవారం నాడు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. తమను బలవంతంగా ఇండియాకు పంపవద్దని ప్రభుత్వానికి వారు మొరపెట్టుకుంటున్నారు.
అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీపార్టీలో ఆల్ ఈజ్ నాట్ వెల్‌గా ఉంది. ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలీవాల్ ఇటీవల అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ఆయన పర్సెనల్ సెక్రటరీ బైభవ కుమార్ ఆమెపై దాడి చేశాడు. దీంతో మలీవాల్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. పో