Home / తప్పక చదవాలి
బ్రిటన్‌లో అక్రమ వలసదార్ల బెడద రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతి ఏడాది వేలాది మంది ఇంగ్లీష్ చానల్ ద్వారా చిన్న చిన్న బోట్లలో బ్రిటన్‌లోకి ప్రవేశిస్తుంటారు.
కెనడా మహిళలు మరియు LGBTQ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని చారిత్రాత్మకమైన అసభ్యత మరియు అబార్షన్ నిరోధక చట్టాలను తొలగించింది, అటువంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులు వారి రికార్డులను క్లియర్ చేయడానికి అనుమతించే సంస్కరణలను తీసుకువస్తున్నట్లు తెలిపింది
పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ జమ్మూ కాశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలపై, ఐక్యరాజ్యసమితి రాయబారిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మంగళవారం గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆయన ప్రకటన నిరాధారమైన మరియు రాజకీయంగా ప్రేరేపించబడినది అని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 56 ఏళ్ల సల్హౌటోనౌ క్రూసే చరిత్ర సృష్టించారు.60 ఏళ్ల రాష్ట్రావతరణలో నాగాలాండ్‌లో శాసనసభ్యురాలిగా మారిన మొదటి ఇద్దరు మహిళల్లో ఆమె ఒకరు.
బిగ్ బాస్ -16 ఫైనలిస్ట్ అర్చన గౌతమ్ తండ్రి తన కుమార్తెను చంపుతానని బెదిరించినట్లు చేసిన ఫిర్యాదు ఆధారంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వ్యక్తిగత సహాయకుడిపై ఎఫ్ఐఆర్ నమోదయింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందు, భారత వైమానిక దళం (IAF) వెస్ట్రన్ సెక్టార్లో ఫ్రంట్‌లైన్ కంబాట్ యూనిట్‌కు నాయకత్వం వహించడానికి గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామిని ఎంపిక చేసింది.
బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని ఒక భవనంలో జరిగిన పేలుడులో 11 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు.మంగళవారం ఢాకాలోని రద్దీగా ఉండే గులిస్తాన్ ఏరియాలోని బహుళ అంతస్తుల భవనంలో ఈ పేలుడు సంభవించిందని స్థానిక అగ్నిమాపక సేవా అధికారి ఒకరు తెలిపారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను నిరంతరం వేధిస్తున్నారని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య మంగళవారం ఆరోపించారు. లాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ను ఢిల్లీలోని ఆమె నివాసంలో సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సలహా మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లను మంగళవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ క్యాబినెట్లో మంత్రులుగా నియమించారు.
ఫ్రాన్స్‌లో ట్రేడ్ యూనియన్లు మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సమ్మకు పిలుపునిచ్చాయి వివాదాస్పదమైన పెన్షన్ సంస్కరణలను దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు