Home / తప్పక చదవాలి
లాట్వియా ఈ సంవత్సరం బాగా తాగి నడిపిన డ్రైవర్ల నుండి కార్లను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ఇలా స్వాధీనం చేసుకున్నవందలాది వాహనాలతో స్దలాలు నిండిపోవడంతో వాటిని ఉక్రేనియన్ మిలిటరీ మరియు ఆసుపత్రులకు పంపాలని నిర్ణయించుకుంది.
ఇండోనేషియా తన రాజధానిని జకార్తా నుంచి బోర్నియోకు తరలిస్తోంది. 2045 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో ఉన్న ఇండోనేషియా తన కొత్త రాజధాని పర్యావరణ హితంగా ఉంటుందని పేర్కొంది. అంతేకాదు ఇది అటవీనగరంగా ఉంటుందని తెలిపింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ గురువారం రాష్ట్రాల గవర్నర్లపై విరుచుకుపడ్డారు. వారికి నోరు మాత్రమే ఉంది, చెవులు లేవని అనిపిస్తుందని అన్నారు.
భారతదేశ ప్రజలకు రాహుల్ గాంధీ పప్పు అని తెలుసని కాని విదేశీయులకు తెలియదని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ వీడియోను పంచుకున్న మంత్రి కిరెన్ రిజిజు భారతదేశ ఐక్యతకు రాహుల్ ప్రమాదకరంగా మారారని ఆరోపించారు.
బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు గాను బుధవారం కొచ్చి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వయనాడ్ నివాసి అయిన షఫీ అనే వ్యక్తి విమానంలో 1,487 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నాడని సమాచారం వచ్చింది.
వివాహం చేసుకున్న దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, కేరళలోని కాసరగోడ్‌లో ఒక ముస్లిం జంట స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద తమ వివాహాన్ని నమోదు చేసుకోనున్నారు. న్యాయవాది మరియు నటుడు షుకూర్ ,అతని భార్య షీనా తమ వివాహాన్ని కొత్తగా నమోదు చేసుకోనున్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కు , మహిళా సాధికారత అనేది ఒక ప్రాధాన్యత. ఈ వ్యూహానికి ప్రైవేట్ రంగం గట్టిగా మద్దతు ఇస్తుంది. కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగులకు తగిన ప్రయోజనాలు మరియు గుర్తింపును ఇవ్వడానికి అదనపు ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నాయి.
Pet dog: కుక్కలు మరియు మానవుల మధ్య బంధం బలంగా ఉంటుంది. ఎందుకంటే తనకు అన్నంపెట్టిన యజమానిని చివరివరకు వదలని విశ్వాసం గల జీవి ఏదైనా ఉంటే అది కుక్కే. కుక్కలకు పలు రకాల శిక్షణలు ఇవ్వడం, అవి మనుషులకు సాయపడటం చాలాకాలంగా మనం చూస్తున్నదే. అయితే ఇటీవలి ఇన్స్టాగ్రామ్ రీల్ లో ఒక కుక్క తన వద్దకు వచ్చిన వారికి ‘ఆశీర్వాదం’ ఇచ్చే వీడియో నెటిజన్లను ఆనందపరిచింది. ఇన్స్టాగ్రామ్ పేజీలో వీడియో భాగస్వామ్యం చేయబడింది. బాబాగా […]
అనామలై కలీం.. తమిళనాడు అటవీ శాఖకు చెందిన ఏనుగు.. అడవి ఏనుగులను పట్టుకోవడం లేదా తరిమికొట్టడం కోసం 99 విజయవంతమైన ఆపరేషన్లకు నాయకత్వం వహించి 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసింది.
: ప్రపంచంలోనే అత్యంత వివక్షకు గురయ్యే మహిళలు ఎవరంటే ఆఫ్గనిస్తాన్ మహిళలే అని చెప్పవచ్చు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి మహిళల పరిస్థితి పెనంలోంచి పొయ్యిలోకి పడ్డట్టయింది.