Last Updated:

Supreme court: సుప్రీం కోర్టులో టీఆర్ఎస్ ఎంపీకి ఎదురుదెబ్బ

తెరాశ పార్టీ ఎంపీ బీబీ పాటిల్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను పున: పరిశీలన చేయాలంటూ తెలంగాణ హైకోర్టుకు సర్వోత్తమ న్యాయస్ధానం సూచించింది

Supreme court: సుప్రీం కోర్టులో టీఆర్ఎస్ ఎంపీకి ఎదురుదెబ్బ

New Delhi: తెరాస పార్టీ ఎంపీ బీబీ పాటిల్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను పున: పరిశీలన చేయాలంటూ తెలంగాణ హైకోర్టుకు సర్వోత్తమ న్యాయస్ధానం సూచించింది.

ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పొందుపరిచారని తెలంగాణ హైకోర్టులో ప్రత్యర్ధి మదన్మోహన్ రెడ్డి సవాల్ చేసారు. అయితే ఆయన పిటిషన్ ను హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అభిషేక్ రెడ్డి తోసిపుచ్చారు. దీంతో మదన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలో సింగిల్ జడ్జి తీర్పును పున: పరిశీలించాలంటూ సుప్రీం సూచనలు చేసింది. అక్టోబర్ 10న హైకోర్టుకు హాజరు కావాలని తీర్పులో పేర్కొనింది. ఈ కేసులో అన్ని అంశాలు ఓపెన్ గానే ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి:  తిరుమలలో ప్రకటన చేస్తారనుకొన్నా.. ట్వీట్ చేసిన రమణ దీక్షితులు

ఇవి కూడా చదవండి: