Last Updated:

Rain Alert : తెలంగాణకు వడగండ్ల వాన గండం.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి

Rain Alert : తెలంగాణకు వడగండ్ల వాన గండం.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి

Rain Alert : రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రేపు, ఎల్లుండి ఎండలు కాస్త తగ్గుముఖం పట్టనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు వానలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురనున్నాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. 15 రోజుల నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగగా, ఎండ వేడిమికి ప్రజలు తల్లడిపోతున్నారు. కాగా, రానున్న రెండురోజుల పాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంచటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నట్లు వాతవరణశాఖ అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: