Last Updated:

Congress MLC candidates : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. ప్రకటించిన అధిష్ఠానం

Congress MLC candidates : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. ప్రకటించిన అధిష్ఠానం

Congress MLC candidates : తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్ఠానం ఖరారు చేసింది. నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని సీపీఐ పార్టీకి కేటాయించింది. మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులుగా అద్దంకి దయాకర్‌, శంకర్‌ నాయక్‌, విజయశాంతి పేర్లను ఖరారు చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎమ్మెల్యేల కోటా నుంచి 5 ఎమ్మెల్సీల ఎన్నికకు ఈ నెల 10లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా మూడు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్కు వస్తాయి. ఐదో స్థానం కోసం ఎంఐఎం పార్టీతోపాటు మరికొన్ని ఓట్లు అవసరం అవుతాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తే కాంగ్రెస్‌ పార్టీకి నాలుగో సీటు లభించే అవకాశం ఉన్నా, సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని సీపీఐ కోరింది. సీపీఐ అగ్ర నాయకత్వం కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడారు. దీంతో సీపీఐకి ఒక స్థానం కేటాయించారు.

ఇవి కూడా చదవండి: