IPS Transfer : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

IPS Transfer : రాష్ట్రంలో భారీగా ఐపీఎసీలను బదిలీ చేశారు. తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీలు ఉన్నారు. మిగిలిన 14 మంది ఎస్పీలకు స్థానచలనం కల్పించారు.
బదిలీ అయిన ఐపీఎస్‌లు..
1. రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా
2. వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్
3. ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ
4. కామారెడ్డి ఎస్పీగా రాజేశ్ చంద్ర
5. నిజామాబాద్ సీపీగా సాయిచైతన్య
6. కరీంనగర్ కమిషనర్‌గా గౌస్ ఆలం
7. ఆదిలాబాద్ అఖిల్ మహజన్
8. నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేశ్
9. భువనగిరి డీసీపీగా అక్షాన్ష్ యాదవ్
10. సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్
11. సిరిసిల్ల ఎస్పీగా గీతే మహేశ్ బాబా సాహెబ్
12. వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్
13. మంచిర్యాల డీసీపీగా భాస్కర్
14. పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్
15. సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి
16. సూర్యాపేట ఎస్పీగా నరసింహ
17. సీఐడీ ఐజీగా ఎం.శ్రీనివాసులు
18. సీఐడీ ఎస్పీగా పి.రవీందర్
19. ఎస్ఐబీ ఎస్పీగా వై.సాయిశేఖర్
20. అడిషనల్ డీజీపీగా అనిల్‌కుమార్
21. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీగా చేతన