Discount on OnePlus 12 Mobile: కూల్ కూల్ ఆఫర్.. వన్‌ప్లస్ 12పై భారీ డిస్కౌంట్.. ఎంతంటే..?

Huge Discount OnePlus 12 Mobile: మీరు కొత్త OnePlus మొబైల్ కొనాలని చూస్తున్నారా? ప్రత్యేకించి మీరు OnePlus 12 ఫోన్‌ను చూస్తున్నట్లయితే ఇదే ఉత్తమ సమయం. అవును, ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ ఈ ఫోన్ కొనుగోలుపై రూ.8,000 కంటే ఎక్కువ తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ ఫోన్ వినియోగదారులకు సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా, అదనపు బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా దీని ధరను మరింత తగ్గించవచ్చు. ఈ ఫోన్ ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
OnePlus 12 Offers
వన్‌ప్లస్12 ఫోన్ రూ. 64,999కి లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ధరను రూ.56,999కి తగ్గించింది. మీరు EMI లావాదేవీలపై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా SBI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, అదనంగా రూ. 4,000. తగ్గింపు లభిస్తుంది. దీంతో ఫోన్ ధర మరింత తగ్గుతుంది. దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్‌ను సిల్కీ బ్లాక్, ఫ్లోవీ ఎమరాల్డ్, గ్లేసియల్ వైట్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయచ్చు.
OnePlus 12 Features
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌లో 6.82-అంగుళాల HD ప్లస్ LTPO ప్లస్ క్వాడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. అలానే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్ ఇస్తుంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం Adreno 750 GPUని కూడా అందించారు. ఈ మొబైల్‌లో 16GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది.
ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 48-మెగాపిక్సెల్ మూడవ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. మొబైల్‌లో 5400mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు.
ఇవి కూడా చదవండి:
- OnePlus Red Rush Days Sale: వన్‌ప్లస్ భారీ ప్లాన్.. సరికొత్త ‘రెడ్ రష్’ సేల్.. ఈ ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు..!