Rain : వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వడగండ్ల వాన

Rain : వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్‌పేట, నవాబుపేట మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. ఈదురు గాలులు వీయడంతో నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామ సమీపంలో భారీ చెట్టు నేలకొరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కూడా వడగండ్ల వాన కురిసింది. ఉరుములు మెరుపులతో మొదలైన వాన దాదాపు గంట సేపు కురిసింది. దీంతో జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. జహీరాబాద్‌తోపాటు మునిపల్లి, ఝరాసంగం మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మునిపల్లి మండలంలోని బుధేరా, మేళాసంగం గ్రామాల్లో వడగండ్ల వాన దంచి కొట్టింది.