Home / తెలంగాణ
నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యవస్థంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.
తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లిష్ సిలబస్లో మార్పులు చేశారు. ఈ ఏడాది నుంచే కొత్త సిలబస్ తో ఇంగ్లిష్ పుస్తకాలను ముద్రించారు. త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. తన కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కొత్త ఇంగ్లిష్ పుస్తకాలను విడుదల చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇల్లందు పరిధిలోని సింగరేణి గనుల్లో భారీగా వరద నీరు నిలుస్తోంది.
అమర్నాథ్ యాత్రలో పోటెత్తిన వరద కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మంది దాకా గల్లంతైనట్లు సమాచారం. అమర్నాథ్ యాత్రకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన కుటుంబంతో కలిసి వెళ్లారు.
తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.