Last Updated:

Kamareddy: కామారెడ్డిలో అమానవీయ ఘటన.. ఏ తల్లికి రాకూడదీ దుస్థితి!

Kamareddy: కామారెడ్డి ప్రభుత్వ దవాఖానాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లి మృతదేహాన్ని ఆస్పత్రిలోనే వదిలేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

Kamareddy: కామారెడ్డిలో అమానవీయ ఘటన.. ఏ తల్లికి రాకూడదీ దుస్థితి!

Kamareddy: కామారెడ్డి ప్రభుత్వ దవాఖానాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లి మృతదేహాన్ని ఆస్పత్రిలోనే వదిలేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఆస్తి పంపకాలు.. బ్యాంకు ఖాతాలో సొమ్ము ఇవ్వలేదని మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

కాసుల కోసం కక్కుర్తి.. (Kamareddy)

కామారెడ్డి ప్రభుత్వ దవాఖానాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లి మృతదేహాన్ని ఆస్పత్రిలోనే వదిలేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఆస్తి పంపకాలు.. బ్యాంకు ఖాతాలో సొమ్ము ఇవ్వలేదని మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

ఆ తల్లి పాలిట తాను దాచుకున్న సొమ్మే శాపమైంది. అయినంత డబ్బున్న.. అయినవారు ఉన్న ఆ తల్లికి ఆదరణ కరవైంది. ముగ్గురు సంతానాన్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసింది. కానీ చివరిదశలో కన్నవారు గాలికొదిలేశారు. అస్తి పంచివ్వలేదని అనాథగా వదిలేశారు. దీంతో అనారోగ్యంతో బాధపడుతూ ఆ వృద్ధురాలు ఆసుపత్రిలోనే కన్నుమూసింది. సభ్య సమాజంలో వస్తున్న విపరీత పోకడలకు కిష్టవ్వ ఉదంతం ఓ ఉదాహరణగా నిలుస్తోంది.

తమ తల్లి ఆస్తి పంపకాలు చేయలేదని.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. అయిన వారు ఉన్నప్పటికీ కిష్టవ్వ అనాథగా మిగిలిపోయింది.

అసలేం జరిగిందంటే?

కామారెడ్డిలోని ఆర్‌బీ నగర్‌కు చెందిన కిష్టవ్వకు ముగ్గురు కుమార్తెలు. ఇటీవలే ఓ కుమార్తె చనిపోయింది. మిగతా ఇద్దరు కామారెడ్డిలో నివసిస్తున్నారు.

కిష్టవ్వ పేరుమీద ఓ ఇల్లు, బ్యాంకు ఖాతాలో రూ.1.15 లక్షల నగదు ఉన్నాయి. ఆమె ఆస్తులకు సంబంధించి దగ్గరి బంధువు ఒకరు నామినీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ డబ్బులను తమకు ఇవ్వాలంటూ ఇద్దరు కుమార్తెలు తల్లిపై ఒత్తిడి తెచ్చారు.

కిష్టవ్వ అనారోగ్యానికి గురవ్వగా.. గత నెల 21న కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆమె మృతి చెందింది.

కిష్టవ్వ మృతి చెందినట్లు ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

బతికి ఉన్నప్పుడు ఆమె బ్యాంక్‌ అకౌంట్‌లో ఉన్న డబ్బులు తమకు ఇవ్వలేదని, అందుకే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుమార్తెలిద్దరూ రాలేదని ఆసుపత్రి సిబ్బందికి తెలిసింది.

దీంతో చేసేదేమీ లేక ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని శవాగారంలో ఉంచారు.

బిడ్డలున్నా అనాథగా తల్లి మృతదేహాన్ని వదిలేయడం పలువురు హృదయాల్ని కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికెళ్లి విచారణ చేపట్టారు.