Monsoon hair care: వర్షాకాలంలో జుట్టు ఊడిపోతుందా.. అందుకు అద్భుతమైన చిట్కాలు ఇవే.!

Monsoon hair care: వర్షాకాలం వచ్చిందంటే చాలు జుట్టు ఊడిపోతుంది. అందుకు కారణం వాతావరణంలో పెరిగిన తేమ. ఇది జుట్టును జిడ్డుగా మారుస్తుంది. ఎప్పుడైతే జుట్టులో జిడ్డు ఏర్పడుతుందో వెంట్రుకలు ఊడిపోతాయి. వర్షాకాలంలో జుట్టు సంరక్షణ చాలా అవసరం. ఎందుకంటే వర్షాకాలంలో మీ తలలో పేరుకుపోతున్న జిడ్డును బయటకు పంపకపోతే హెయిర్ ఫాల్ అధికమవుతుంది. అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలేంటో ఇప్పడు చూద్దాం.
వెంట్రుకలు దెబ్బతినకుండా ఉండాలంటే వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యకరమైన జుట్టుకోసం లేదా జుట్టు రాలకుండా దెబ్బతినకుండా నిరోధించడానికి ఇక్కడ కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఉన్నాయి.
తలను ఎప్పుడు పొడిగా ఉంచాలి
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో తలలో కూడా తేమ పెరుగుతుంది. అదేకాకుండా అప్పుడప్పుడు అనుకోకుండా తేలికపాటి తుంపర లేదా వర్షంలో తల తడుస్తుంది. అలాంటప్పుడు తననలో జిడ్డు రావడం మొదలవుతుంది. ఇది ఫంగల్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. మీరు మీ జుట్టును తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూతో క్రమం తప్పకుండా తల స్నానం చేయాలి. ఇది అదనపు నూనె, చెమట మరియు ధూళిని తొలగించడంలో సహాయపడుతుంది. వర్షంలో తడిసిన తర్వాత మీ తలను పూర్తిగా ఆరబెట్టడం తప్పనిసరి. ఇది చుండ్రు మరియు తలలోని చికాకును నివారించడానికి సహాయపడుతుంది.
వర్షాకాలంలో జుట్టు సున్నితంగా ఉంటంది. వాటిపై మామూలు టవల్స్ రఫ్ గా పనిచేస్తాయి. దీంతో వెంట్రుకలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి సున్నితంగా తలను ఆరబెట్టుకోడానికి మైక్రోఫైబర్ టవల్ ను ఉపయోగించాలి.
యాంటీ-ఫ్రిజ్ సీరం లేదా లీవ్-ఇన్ కండిషనర్
తేమ వల్ల జుట్టు క్యూటికల్స్ తెరుచుకుంటాయి, ఇది వెంట్రుకలను ఫ్రిజ్ మరియు డ్రైగా ఉండేందుకు దారితీస్తుంది. కాబట్టి యాంటీ-ఫ్రిజ్ సీరం లేదా లీవ్-ఇన్ కండిషనర్ ఉపయోగించాలి. తద్వారా వెంట్రుకలకు తేమ వలన కలిగి నష్టాన్ని తగ్గిస్తుంది. ఆపై మీ జుట్టును పర్యావరణ కారకాల నుండి కాపాడుతుంది.
జుట్టు చివర్లను క్రమం తప్పకుండా కత్తిరించండి
వర్షాకాలంలో జుట్టు చివరలు చీలిపోయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి క్రమం తప్పకుండా చివర్లను కత్తిరించండి. దెబ్బతిన్న చివరలను తొలగించి, మరింత విరిగిపోకుండా ఆపవచ్చు. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా మరియు నిర్వహించదగినదిగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
వర్షాకాలంలో ఎక్కువ నూనె రాయకండి
తలకు వర్షాకాలంలో కొబ్బరి నూనె రాయడం తగ్గించాలి. వర్షాకాలం మామూలుగానే జుట్టు తేమతో ఉంటుంది. ఆపై అధికంగా కొబ్బరినూనెను రాయడం వలన మరింత తేమ ఎక్కువవుతుంది. అప్పుడు జుట్టుపై జిడ్డు ఎక్కువ అవుతుంది.