Published On:

Ambati Rambabu: కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. సింగయ్య మృతి వీడియోపై మాజీ మంత్రి అంబటి ఫైర్

Ambati Rambabu: కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. సింగయ్య మృతి వీడియోపై మాజీ మంత్రి అంబటి ఫైర్

Former Minister Ambati Rambabu: ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ, మీడియా, సోషల్ మీడియాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో కాన్వాయ్‌‌లోని వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి జగన్ ప్రయాణిస్తున్న వాహనమే కారణమని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ప్రజల ప్రాణాలను బలి తీసుకునేందుకు జగన్ రాక్షసుడిలా తిరుగుతున్నాడని నెటిజన్లు మండిపడుతూ పోస్టులు పెడుతున్నారు. వ్యవహారంపై మాజీ మంత్రి అంబటి స్పందించారు. మంత్రి లోకేశ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 

నారా లోకేశ్ తండ్రి చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారనే వైసీపీ నేతలను లోపల పెడుతున్నారని ఆరోపణలు చేశారు. సింగయ్య మృతిపై ఎల్లో మీడియా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ప్రమాదంపై ఎస్పీ స్పందించారని, జగన్ కాన్వాయ్ ముందు ఉన్న వాహనం ఢీకొనడం వల్ల మరణించినట్లు నిర్ధారించారని తెలిపారు. ఇప్పుడు జగన్ కారు ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు పుకార్లు పుట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం, ఎల్లో మీడియాతో కలిసి జగన్‌ను ఇంటి నుంచి బయటకు రాకుండా చేయాలనే కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. వైసీపీ జగన్‌ను ఎవరు అడ్డుకోలేరని, ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడతామని అంబటి వార్నింగ్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి: