Published On:

Konda Surekha : కడియం శ్రీహరి నామోషీగా ఫీలవుతున్నారు : కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Konda Surekha : కడియం శ్రీహరి నామోషీగా ఫీలవుతున్నారు : కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Konda Surekha Sensational Comments On Kadiyam Srihari : తన మంత్రి పదవి పోతుందంటూ కడియం శ్రీహరి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. తన ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీలవుతున్నారన్నారు. శుక్రవారం మీడియాతో ఆమె ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కడియంపై విమర్శలు గుప్పించారు.

 

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి వద్ద కడియం తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. టీడీపీలో నడిపించుకున్నట్లు.. ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. కడియం కూతురుకు అదృష్టం ఉండి ఎంపీ అయ్యారని, తన కూతురుకు అదృష్టం లేక ఎమ్మెల్యే కాలేదన్నారు. కడియం కూతురు ఎంపీ పదవి తీయాలని తాను అంటున్నానా? భద్రకాళీ ఆలయాన్ని కొందరు తమ సొత్తుగా భావిస్తున్నారని ఫైర్ అయ్యారు. కానీ, ఎవరి సొత్తు కాదన్నారు.

 

ఈ నెల 22న జరుగాల్సిన భద్రకాళీ అమ్మవారి బోనాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొందరి అభ్యంతరాల మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అసాంఘిక శక్తులతో గొడవలు సృష్టిస్తారనే అనుమానం ఉందన్నారు. మాంసాహారంతో బోనాలు చేస్తారని కొందరు తప్పుడు సంకేతాలు తీసుకెళ్లారని తెలిపారు. భద్రకాళీ బోనాల నిర్వహణపై సంప్రదింపుల తర్వాత కార్యచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఆగమశాస్త్రం ప్రకారం అమ్మవారికి బోనం సమర్పిస్తామన్నారు.

 

గోదావరి పుష్కరాల విషయంలో కేంద్రం తెలుగు రాష్ట్రాలను సమంగా చూడాలని కోరారు. తెలంగాణపై వివక్ష చూపొద్దన్నారు. గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని గుర్తుచేశారు. భద్రాచల రాముడి పాదాల నుంచి గోదావరి ప్రవహిస్తుందన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ చొరవ చూపి పుష్కరాల కోసం నిధులు ఇప్పించాలని కొండా సురేఖ కోరారు.

ఇవి కూడా చదవండి: