Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్.. లక్షకు చేరువలో బంగారం ధరలు!

Gold Rates Hike Today: మహిళలకు బిగ్ షాక్. బంగారం ధరలు రోజురోజుకు దడపుట్టిస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ఆలోచిస్తున్నారు. తాజాగా, ఇంటర్నేషన్ల్ మార్కెట్ ధరలను పరిశీలిస్తే.. ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అయితే సుంకాల ఆందోళనలు నెలకుంటుండగా.. బంగారం మరింత ఆందోళనకు గురిచేస్తుంది.
దేశానికి బంగారం ఎక్కువగా స్విట్జర్లాండ్ నుంచే దిగుమతి అవుతోంది. సుమారు 40 శాతం వరకు దిగుమతి చేసుకుంటుండగా.. దుబాయి 16 శాతం రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత 10 శాతం దక్షిణాఫ్రికా ఉంది. దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 8శాతం ఉంది. గతేడాది వెండి 11.24 శాతం తగ్గి 4.82 బిలియన్లకు చేరాయి.
ఇక, దేశీయంగా బంగారం రేట్లు స్థిరంగా కొనసాగుతుండగా.. హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్లపై రూ.89,450 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,500 ఉంది. వెండి విషయానికొస్తే.. కిలో వెండి రూ.1.10లక్షల వద్ద ఉంది.