Last Updated:

Telangana Budget 2023: తెలంగాణ మొత్తం బడ్జెట్ 2.90 లక్షల కోట్లు.. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన మంత్రి హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా ఆర్థిక మంత్ర హరీష్ రావు తెలంగాణ బడ్జెట్ 2023 ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

Telangana Budget 2023: తెలంగాణ మొత్తం బడ్జెట్ 2.90 లక్షల కోట్లు.. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన మంత్రి హరీష్ రావు

Telangana Budget 2023: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్ 2023 ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

దాదాపు రూ. 2,90,396 కోట్లతో బడ్డెట్ ను సభ ముందుకు తీసుకొచ్చారు మంత్రి హరీష్ రావు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ సారి బడ్జెట్ పై టీ సర్కార్ దృష్టి పెట్టింది.

మంత్రి హరీష్ రావు నాల్గవ సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో .. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కానుంది.

బడ్జెట్ హైలెట్స్ (Telangana Budget 2023)

 

ఎయిర్ పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు

యాదాద్రి ఆలయ అభివృద్ధి కి రూ. 500 కోట్లు

మహిళా వర్సిటీకి రూ. 100 కోట్లు

కొత్త‌గా మ‌రో 100 బ‌స్తీ ద‌వాఖానాలు ఏర్పాటు

ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు

రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీలు సంఖ్య 26 కు చేరనుంది.

ఈ ఏడాది 60 జూనియర్, సీనియర్ జడ్జీల కోర్టు ఏర్పాటు

కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాల కోసం  రూ. 1000 కోెట్లు

ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ, సెర్ఫ్ ఉద్యోగుల పే స్కేల్ సవరణ

ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1, 463 కోట్లు

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ. 1200 కోట్లు

కేసీఆర్ న్యూట్రిషయన్ కిట్ రూ. 200 కోట్లు

అన్ని జిల్లాల‌కు కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్స్ విస్త‌ర‌ణ

ప్రణాళికా విభాగానికి రూ. 11 వేల 495 కోట్లు

న్యాయ శాఖకు రూ. 1665 కోట్లు

జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 100 కోట్ల కార్ఫస్ ఫండ్

 

కొనసాగుతున్న బడ్జెట్ ప్రసంగం

ఆయిల్ ఫామ్ కు రూ. 1000 కోట్లు

మహిళ శిశు సంక్షేమానికి రూ. 2,131 కోట్లు

తెలంగాణ ఆర్టీసీ కోసం రూ. 1500 కోట్లు

దళిత బందు కోసం 17 వేల 700 కోట్లు కేటాయింపు

బడ్జెట్ లో నీటిపారుదల రంగానికి 26 వేల 8వందల 85కోట్లు

అసరా పెన్షన్ కోసం 12 వేల కోట్ల కేటాయింపు

వ్యవసాయ రంగానికి 26 వేల 8వందల 31కోట్లు

విద్యుత్ రంగానికి 12 వేల 7వందల 27కోట్లు

బీసీ సంక్షేమం కోసం 6 వేల 2 వందల 29కోట్లు

కళ్యాణ లక్ష్మి షాది ముబరక్ 3 వేల 2 వందల 10కోట్లు

మైనారిటీ సంక్షేమం 2వేల 2వందల కోట్లు

హరిత హారం పథకానికి 14 వందల 471 కోట్లు

విద్యాశాఖ కు 19 వేల 93 కోట్లు

వైద్య శాఖకు 12వేల 161కోట్లు

పంచాయతీ రాజ్ శాఖ కు 31 వేల 4 వందల 26కోట్లు కేటాయింపు

మునిసిపల్ శాఖకు 11 వేల 3 వందల 72 కోట్లు కేటాయింపు

రోడ్లు భవనాలకు 2 వేల 5 వందల కోట్లు

హోంశాఖ కు 9 వేల 5 వందల 99 కోట్లు

పరిశ్రమల శాఖకు 4 వందల 37  కోట్లు

షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధి కింద 36 వేల 750 కోట్లు

షెడ్యుల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15 వేల 233కోట్లు

 

ప్రగతి శీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తోంది అంటూ హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.

తెలంగాణ మొత్తం బడ్జెట్ 2.90 లక్షల కోట్లు అని హరీష్ రావు ప్రకటించారు. రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూలధన వ్యయం రూ. 37,525 కోట్లు, వ్యవసాయానికి కేటాయింపులు రూ. 26,831 కోట్లు.

మరో వైపు శాసప మండలి లోనూ శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ ప్రసంగానికి ముందు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా బడ్జెట్ పత్రాలను స్పీకర్ కు అందజేశారు. అనంతరం శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ ని కలిసిన మంత్రులు బడ్జెట్ పత్రాలను అందజేశారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/