Alleti Maheshwar Reddy : డిసెంబర్‌లో ముఖ్యమంత్రి మార్పు ఖాయం : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

Alleti Maheshwar Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మారారంటే.. ఇక మారేది సీఎం అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ టీమ్ నుంచి కొత్త ఇన్‌చార్జిని పెట్టారన్నారు. సోమవారం ఆయన చిట్‌చాట్‌లో మాట్లాడారు. సీఎం ఛేంజ్ అనే మిషన్‌ను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించారని తెలిపారు. సీఎంను మార్చేందుకు ఆమె గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారని చెప్పారు. డిసెంబర్‌లో సీఎం మార్పు ఖాయమని జోస్యం చెప్పారు. వనపర్తి సభలో ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే ఇంకా పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్‌రెడ్డి చెప్పారని, ఆడబిడ్డల ఆశీర్వాదం కంటే.. ఢిల్లీ నుంచి వచ్చిన ఆశీర్వాదం ఆయనకు ముఖ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాడి తప్పిందన్నారు.
సీఎం పీఠంపై ముగ్గురు మంత్రుల కన్ను..
ముఖ్యమంత్రి కూర్చిపై మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి కన్నేశారని ఆరోపణలు చేశారు. వనపర్తి సభలో ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్‌రెడ్డి చెప్పారని, ఆడబిడ్డల ఆశీర్వాదం కంటే.. ఢిల్లీ నుంచి వచ్చిన ఆడబిడ్డ ఆశీర్వాదం ఆయనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాడి తప్పిందని ఆరోపించారు. మంత్రుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉందన్నారు. ఒక్క మంత్రి కూడా ముఖ్యమంత్రి రేవంత్‌ను లెక్కచేయడం లేదని ఎద్దేవా చేశారు. మంత్రుల పనితీరులోనూ చాలా మార్పులు వచ్చాయన్నారు. ఎవరికీ శాఖలపై అవగాహన లేదని విమర్శించారు.
హామీలను గాలికి వదిలేశారు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, మహిళలకు రూ.2500, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు తదితర పథకాలను గంగలో కలిపారని ఆరోపించారు. రైతులను కూడా వేధిస్తున్నారన్నారు. రేవంత్‌ను గద్దె దింపేందుకే వ్యతిరేకత అయ్యేలా మంత్రులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగేది ఎవరికీ తెలియదని వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలిగా మీనాక్షి నటరాజన్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి ముఖ్య నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. మంత్రుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉందన్నారు. ఒక్క మంత్రి కూడా సీఎంను లెక్కచేయడం లేదని వ్యాఖ్యానించారు.