Last Updated:

D Srinivas: కాంగ్రెస్ గూటికి డి. శ్రీనివాస్.. రేవంత్ సమక్షంలో చేరిక

D Srinivas: సీనియర్ రాజకీయ నేత.. డి. శ్రీనివాస్ సొంత గూటికి చేరుకున్నారు. ఈ మేరకు గాంధీ భవన్ కు స్వయంగా వచ్చి.. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు.. కుమారుడు ధర్మపురి సంజయ్ కూడా కాంగ్రెస్ లో చేరారు.

D Srinivas: కాంగ్రెస్ గూటికి డి.  శ్రీనివాస్.. రేవంత్ సమక్షంలో చేరిక

D Srinivas: సీనియర్ రాజకీయ నేత.. డి. శ్రీనివాస్ సొంత గూటికి చేరుకున్నారు. ఈ మేరకు గాంధీ భవన్ కు స్వయంగా వచ్చి.. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు.. కుమారుడు ధర్మపురి సంజయ్ కూడా కాంగ్రెస్ లో చేరారు.

సొంత గూటికి డి. శ్రీనివాస్ (D Srinivas)

సీనియర్ రాజకీయ నేత.. డి. శ్రీనివాస్ సొంత గూటికి చేరుకున్నారు. ఈ మేరకు గాంధీ భవన్ కు స్వయంగా వచ్చి.. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఆయనతో పాటు.. కుమారుడు ధర్మపురి సంజయ్ కూడా కాంగ్రెస్ లో చేరారు. ఇవాళ గాంధీ భవన్ కు వచ్చిన ఆయన.. పార్టీ ఇంఛార్జ్ ఠాక్రే, రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

శ్రీనివాస్ తో పాటు ఆయన తనయుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు.

ఈ మేరకు డీఎస్ ను మాణిక్‌ రావ్‌ ఠాక్రే పార్టీలోకి ఆహ్వానించారు.

వీహెచ్.. డీఎస్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఎంపీలు ఉతమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేణుకా చౌదరి, పొన్నాల లక్ష్మయ్యతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.

చేరిక విషయంలో ట్విస్ట్..

కాంగ్రెస్ లో చేరిక విషయంలో.. డి. శ్రీనివాస్ ట్విస్ట్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో తాను చేరడం లేదని ఉదయం ఓ ప్రకటన విడుదలైంది.

కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ఆయనే స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత.. కాంగ్రెస్ పార్టీకి శ్రీనివాస్ దూరమయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

భారాస నుంచి డీఎస్ కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం లభించింది. ఆ తర్వాత భారాసకు ఆయన దూరంగా ఉంటూ వచ్చారు.

మరోవైపు హైదరాబాద్​ గాంధీభవన్​లో కాంగ్రెస్ నేతలు దీక్ష చేస్తున్నారు.

రాహుల్ గాంధీపై వేటు వేయటాన్ని ఖండిస్తూ.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు

కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​రావు ఠాక్రే, పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, ఇతర ముఖ్య నేతలంతా దీక్ష చేయనున్నారు.