Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించింది. అనంతరం సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసన సభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో పని చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించింది. అనంతరం సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసన సభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో పని చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయనతో వ్యక్తిగతంగా మంచి అనుబంధముందన్నారు. ఎటువంటి సందర్భంలోనైనా చిరునవ్వుతో చాలా ఓపికతో ఉండేవారని, అందరితో కలుపుగోలుగా ఉండేవారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారన్నారు.
సాయన్నకు నివాళులు..(Telangana Assembly)
సాయన్న వివాద రహితుడని కంటోన్మెంట్ ప్రజలకు ఎన్నో విధాలుగా సేవలందించారని కేసీఆర్ అన్నారు. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీ లో కలపాలని సాయన్న ఏళ్ల తరబడి డిమాండ్ చేసారని ఈ నేపధ్యంలో దీనిపై పలు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని అన్నారు. కేంద్రం కంటోన్మెంట్లను స్దానిక సంస్దల్లో కలపాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయని ఈ విధంగా అయినా సాయన్న కోరిక తీరాలని కోరుకుంటున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. సాయన్న కుటుంబానికి అండటా ఉంటామని అన్నారు. సీఎం కేసీఆర్ తో పాటు తలసాని శ్రీనివాస యాదవ్ , దానం నాగేందర్ , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు తదితరులు సాయన్న సేవలను కొనియాడారు. అనంతరం సభ రెండు నిమషాలు పాటు మౌనం పాటించగా శుక్రవారానికి వాయిదా పడింది.