DR. Bharati : ఎందరో మహిళలకు స్పూర్తిగా నిలిచిన డాక్టర్ సాకే భారతి.. ప్రభుత్వం కూడా చేదోడుగా
సంకల్పానికి మించిన ఆయుధం మరొకటి లేదని.. స్త్రీ అనుకుంటే సాధించలేనిది ఏది లేదని మరో మహిళ నిరూపించింది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఓవైపు కూలీ పనులు చేసుకుంటూనే భర్త ప్రోత్సాహంతో మరో వైపు చదువును కొనసాగించింది. అవిశ్రాంతంగా పేదరికంపై పోరాడి.. కృష్టి, పట్టుదలతో చివరికి తాను అనుకున్నది సాధించిన ఆ వీర వనిత పేరు.. సాకే భారతి ..
DR. Bharati : సంకల్పానికి మించిన ఆయుధం మరొకటి లేదని.. స్త్రీ అనుకుంటే సాధించలేనిది ఏది లేదని మరో మహిళ నిరూపించింది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఓవైపు కూలీ పనులు చేసుకుంటూనే భర్త ప్రోత్సాహంతో మరో వైపు చదువును కొనసాగించింది. అవిశ్రాంతంగా పేదరికంపై పోరాడి.. కృష్టి, పట్టుదలతో చివరికి తాను అనుకున్నది సాధించిన ఆ వీర వనిత పేరు.. సాకే భారతి ..
అనంతపురము జిల్లా శింగమనల నాగుల గుడ్డం గూడేనికి చెందిన భారతిది నిరుపేద కుటుంబం. భారతి తండ్రికి ముగ్గురు ఆడపిల్లలు. ఆయన వారిని పోషించలేని పరిస్థితుల్లో వాళ్ల అమ్మమ్మ ఊరు నాగులుగుడ్డంకు ఆరేళ్ల బిడ్డప్పుడే తీసుకొచ్చాడు ఆమె తాత (తల్లి తండ్రి). దీంతో భారతి చిన్నతనం నుంచే అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగారామె. అక్కడే అమ్మకు సొంత తమ్ముడైన శివప్రసాద్ ను పెళ్ళి చేసుకున్నారు. తర్వాత చదువు కొనసాగించారు.
ఐదవ తరగతి వరకూ నాగులగుడ్డంలో చదివారు భారతి. పదో తరగతి శింగనమలలో పూర్తి చేశారు. ఇంటర్ పామిడిలో, డిగ్రీ, పీజీ అనంతపురం ఎస్ఎస్‌బీఎన్‌లో, తర్వాత పీహెచ్‌డీని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో చేశారు. పేదరికాన్ని జయించి ఎంతో కష్టపడి కూలి పనులు చేసుకుంటూ చదువుకున్నందుకు అందుకు తగ్గ ఫలితం వచ్చింది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్ డి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి పూర్తి చేసింది. కూలి పనుల భారతి (DR. Bharati) నుంచి డాక్టర్ భారతిగా ఎదిగిన తీరుకి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా పలువురు ప్రముఖులు, నాయకులు ఆమెను అభినందించారు.
భారతి టాలెంట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఆమెకు సాయం చేసి అండగా నిలిచింది. ఆమెకు 2 ఎకరాల వ్యవసాయ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు గవర్నమెంట్ తరపున రెండు ఎకరాల భూమి పట్టాను సాకే భారతికి అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి అందించారు. కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో పొలం పట్టా అందజేసిన కలెక్టర్ గౌతమి.. భారతి సాధించిన విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా అనుకున్నది సాధించిన భారతి.. ఎందరికో స్పూర్తిగా నిలిచారని కితాబిచ్చారు. సాకే భారతికి నిత్యం ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని కలెక్టర్ గౌతమి హామీ ఇచ్చారు. ”ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం తరపున భారతికి శింగనమల మండలం సోదనపల్లి గ్రామ పొలం సర్వే నెంబరు 9-12లో వ్యవసాయ యోగ్యమైన రెండు ఎకరాల భూమి భారతికి అందించాం. అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటిని నిర్మించి ఇస్తాం. ఎ
స్‌కేయూ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో జేఎల్ పోస్టు (కెమిస్ట్రీ) ఖాళీగా ఉంది. ఆమె అంగీకరిస్తే ఆ పోస్టుకు నామినేట్ చేస్తాం. జిల్లా యంత్రాంగం నుంచి ఆమెకు అన్ని విధాలుగా అవసరమైన ప్రోత్సాహం అందిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమెకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి” అని కలెక్టర్ గౌతమి ఆకాంక్షించారు. భారతిని యువత రోల్ మోడల్ గా తీసుకోవాలని కలెక్టర్ గౌతమి అన్నారు. చదువుకి పేదరికం అడ్డు కాదని చెప్పడానికి సాకే భారతి నిలువెత్తు నిదర్శనం అన్నారు. పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని సాకే భారతి నిరూపించారని కలెక్టర్ గౌతమి ప్రశంసించారు.