Home / ప్రాంతీయం
బిజెపి నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) అనారోగ్యంతో మంగళవారం రాత్రి స్వర్గస్తులయ్యారు . మల్లయ్యకు ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉండగా ఈటల రాజేందర్ రెండో కుమారుడు.
బాసర ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంవిద్యార్థి సురేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నాంపల్లి 14వ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజాసింగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంకావడంతో రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో రాజాసింగ్‌కు ధర్మాసనం రిమాండ్ విధిస్తూ ఆదేశించింది. అనంతరం రాజాసింగ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను జనగామ జిల్లాలో పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఆయన ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తనను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.
మహ్మద్ ప్రవక్త పై కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను మంగళవారం ఉదయం పోలీసులు రాజా సింగ్ ఇంటికి వెళ్ళి అరెస్టు చేసి రాజా సింగును అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని సౌత్, ఈస్ట్, వెస్ట్ జోన్ల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజీస్టు , మోటివేషనల్ స్పీకర్ , స్టోరీ టెల్లర్, సహజ ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు శైలజ విస్సంశెట్టి గారు ఎంతో మందికి సహాయం చేశారు. పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక బడికి పంపించకుండా పిల్లలను ఇంటి దగ్గరే ఉంచిన తల్లితండ్రులు ఇంకా ఉన్నారని ...అలాంటి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలకు చదువుకు మించిన పెద్ద బహుమతి ఏమి ఇవ్వలేమని సహజ ఫౌండేషన్ శైలజ విస్సంశెట్టి గారు పలు సార్లు పలు కార్యక్రమాల్లో ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ శాఖల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 502 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ సమాచారాన్ని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం సమావేశం అయిన విషయం తెలిసిందే. వీరిద్దరి సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి భేటీ పై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఫీనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫీనిక్స్ ఛైర్మన్లు, డైరక్టర్ల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తుంది ఫీనిక్స్ సంస్థ.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా, జనగామ జిల్లాలో పాదయాత్రలోనే బండి సంజయ్ దీక్షకు దిగేందుకు సిద్దమైయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీక్షకు దిగుతుండగా అరస్ట్ చేశారు.