Last Updated:

బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్ది ఆత్మహత్య

బాసర ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంవిద్యార్థి సురేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్ది ఆత్మహత్య

బాసర ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంవిద్యార్థి సురేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఆగ్రహంతో పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

మరోవైపు తమ కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురైనట్లు అనుమానంగా ఉందని సురేష్ తండ్రి రాథోడ్ గంగారం తెలిపారు. సురేష్ ఒంటిపై గాయాలన్నాయని ఆయన పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోస్టుమార్టానికి అనుమతించమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సురేష్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి: