TS CPGET Results 2022: నేడు టీఎస్ సీపీజీఈటీ 2022 ఫలితాలు
తెలంగాణ విధ్యార్ధులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీఎస్ సీపీజీఈటీ 2022 ఫలితాలు ఈ రోజు విడుదల అవ్వనున్నాయి. సెప్టెంబర్ 16 న టీఎస్ సీపీజీఈటీ 2022 ఫలితాలు విడుదల చేయనున్నారు.
Hyderabad: తెలంగాణ విధ్యార్ధులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీఎస్ సీపీజీఈటీ 2022 ఫలితాలు ఈ రోజు విడుదల అవ్వనున్నాయి. సెప్టెంబర్ 16 న టీఎస్ సీపీజీఈటీ 2022 ఫలితాలు విడుదల చేయనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఇతర యూనివర్సిటీలలో పీజీ, పీజీ డిప్లొమా, పీజీ కోర్సుల్లో చేరడానికి 2022 ఆగస్టు 11 నుంచి 23 వరకు ప్రవేశ పరీక్షల జాబితాను విడుదల చేయనున్నారని కన్వినర్ ప్రొ. పాండురంగారెడ్డి వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన CPGET– 2022లో 45 సబ్జెక్టులకు గాను 67,115 మంది విధ్యార్ధులు దరఖాస్తులు చేసుకున్నారు.
ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఓయూ యూనివర్సిటీతో పాటు తెలంగాణ, శాతా వాహన, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ తెలంగాణ మహిళ, కాకతీయ, పాలమూరు,యూనివర్సి టీల్లో పీజీ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సుల్లో కూడా ప్రవేశాలు కల్పించనున్నట్లు స్పష్టంచేశారు.పరీక్ష రాసిన విధ్యార్ధులు ఈ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. https://cpget.tsche.ac.in/