New Virus In China: చైనాలో మరో కొత్త వైరస్..ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం!
Human Metapneumovirus HMPV Virus Creates COVID-19 Like Scare in China: చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటాష్ నిమో వైరస్ హెచ్ఎంపీవీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ బారిన పడిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్సత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ ఫ్లూయంజా ఏ మైకో ఫ్లాస్మా, న్యూమోనియా, కోవిడ్ 19 వంటి వైరస్‌లు వ్యాపి చెందినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరోవైపు దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహాలోనే లక్షణాలు కనిపిస్తున్నాయని సమాచారం. వైరస్ వ్యాప్తిని ఆ దేశ ఆరోగ్య శాఖ పరిశీలిస్తుంది. ఈ ఊహాగానాలకు ఓ మీడియా పత్రికలో వచ్చిన వార్తలు మరింత బలాన్ని చేకూరిస్తున్నాయి.
హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించారు. తీవ్రమైన కేసుల్లోబ్రోన్ కైటిస్, న్యుమోనియాకు దారి తీసే ప్రమాదం ఉంటుందని చెప్పారు. వృద్ధులు, శిశువుల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రధానంగా హ్యుమినిటీ శక్తి తక్కువ ఉన్న వారిలో తీవ్ర ప్రభావం చూపనుందని వైద్యులు చెబుతున్నారు. ఆస్తమా, క్రానిక్ ఆఫ్ స్ట్రక్టీవ్ లేదా పల్ మనరీ, లంగ్స్ వంటి జబ్బులు ఉన్నవారు తీవ్రమైన ఫలితాలకు గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వైరస్ ప్రధానంగా దగ్గు, తుమ్మడం ద్వార ఇతరులకు వ్యాప్తిస్తుందని తెలిపింది. వ్యాధి పొదిగే కాలం మూడు నుంచి ఐదు రోజులు ఉంటుందని సీడీసీ తెలిపింది.
హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో ఫ్లూతో పాటు కొవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తి చెందడంపై అక్కడి అధికారులు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు.