Last Updated:

Upcoming Cars: మార్కెట్లోకి రానున్న కొత్త కార్లు.. తొందరపడకండి.. సింగిల్ ఛార్జ్‌తో 682 కిమీ రేంజ్..!

Upcoming Cars: మార్కెట్లోకి రానున్న కొత్త కార్లు.. తొందరపడకండి.. సింగిల్ ఛార్జ్‌తో 682 కిమీ రేంజ్..!

Upcoming Cars: కొత్త ఎలక్ట్రిక్ కార్ల విడుదలతో 2025 భారత్ ఆటో మార్కెట్లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. సంవత్సరం మొదటి నెలలో అంటే జనవరిలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో 5 ప్రధాన ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. వీటిలో హ్యుందాయ్ క్రెటా EV నుండి మారుతి ఇ విటారా వరకు పేర్లు ఉన్నాయి. రాబోయే ఈ ఎలక్ట్రిక్ కార్ల గురించి ఒకసారి చూద్దాం.

Hyundai Creta EV
హ్యుందాయ్  Creta EV నుండి అధిక అంచనాలను కలిగి ఉంది. ఈ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలను కంపెనీ ఇటీవల టీజర్ ద్వారా అందించింది. EV స్పెసిఫిక్ డిజైన్‌తో వస్తున్న క్రెటా EV ఒకే ఛార్జ్‌పై దాదాపు 400KM రేంజ్‌ను అందిస్తుంది.

Maruti suzuki e Vitara
మారుతి మొదటి ఎలక్ట్రిక్ కారు జాబితాలో రెండవ స్థానంలో ఉంది. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన ఇ విటారా ఇప్పుడు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఇది 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. సింగిల్, డ్యూయల్ మోటార్ సెటప్‌తో సెట్ చేసిన ఈ AWD ఆప్షన్‌తో e-SUV సుమారు 500KM పరిధిని పొందగలదని భావిస్తున్నారు.

Mahindra BE 6
మహీంద్రా ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 18.90 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ-ఎస్‌యూవీని ఈ నెలలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో అధికారికంగా విడుదల చేయనున్నారు. దీని క్లెయిమ్ రేంజ్ 682 కిలోమీటర్లు.

Mahindra XEV 9e
మహీంద్రా XEV 9e  ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.9 లక్షలు. మహీంద్రా  ఈ ఎలక్ట్రిక్ SUV 2025 భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో అధికారికంగా ప్రారంభించించనున్నారు. XEV 9e క్లెయిమ్ చేసిన పరిధి 656 కిలోమీటర్లు.