Home / ప్రాంతీయం
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి ఉద్యమం అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు.
చంద్రబాబు సైకిల్ చక్రాలు తుప్పుపట్టాయని.. టీడీపీ రాష్ట్రం కోసం చేసిందేమీ లేదని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.
ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పచ్చదనాన్ని అభివృద్ధి చేసినందుకు హైదరాబాద్ నగరం ప్రతిష్టాత్మక AIPH గ్లోబల్ ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022’ అందుకుంది.
గత కొద్దిరోజుల నుంచి తెలుగురాష్ట్రాల ప్రజలను ఎడతెరపిలేని వర్షాలు అల్లాడిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రోజురోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై మృగాళ్ల విరుచుకుపడుతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా ఈ కామాంధులు అరాచకాలకు అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ కలకలం రేపుతుంది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు రాజకీయ సంబంధ వ్యవహారాల్లో పాల్గొనకూడదన్న నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ మీటింగ్‌లో పాల్గొన్నారంటూ తమిళిసై పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మునుగోడు ఉపఎన్నిక ముందు తెరాస ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ పార్టీలో తనను అవమానించారని, వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానంటూ బూర నర్సయ్య గౌడ్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ రాజకీయాలు విశాఖ కేంద్రంగా ఉట్టుడుకుతున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ విశాఖ గర్జన ర్యాలీ నిర్వహిస్తుండగా మరోవైపు నేడు జనసేనాని విశాఖలో పర్యటించనున్నారు.
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని అంటూ నేడు విశాఖ గర్జన కార్యక్రమానికి జేఏసీ శ్రీకారం చుట్టింది. మన విశాఖ-మన రాజధాని నినాదంతో అధికార వైసీపీ ఈ ర్యాలీని తలపెట్టింది. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వికేంద్రీకరణకు మద్దతుగా లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొననున్నారు.
తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికల వేడి కొనసాగుతుంది. కారు-కమలానికి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో మరోమారు బీజేపీకి వ్యతిరేకంగా అంటించి ఉన్న పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.