Home / ప్రాంతీయం
తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి నింగికెగియనుంది. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ అయిన ‘విక్రమ్-ఎస్’ను ప్రయోగించేందుకు హైదరాబాదీ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్’సిద్ధమైంది. ఈ రాకెట్ ద్వారా 3 కస్టమర్ పేలోడ్లను ఈనెల 12-16వ తేదీల్లో అంతరిక్షంలోకి పంపనున్నారు.
బుధవారం తెల్లవారుజామున ఏపీలోని రాజమండ్రిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దానితో అటుగా నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని పేర్కొనింది.
తెరాస పార్టీ ఎమ్మెల్యేను ప్రలోభాలకు గురిచేసిన కేసులో ప్రధాన నిందుతుడు రామచంద్రభారతి పై బంజారాహిల్స్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు వచ్చిన సమయంలో రుషికొండను కళ్లారా చూడాలంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రధానికి లేఖ రాశారు.
మునుగోడు ఉపఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కడప నగరంలో సంచలన సృష్టించిన సెల్ ఫోన్ల కంటైనర్ దొంగతనం కేసును పోలీసులు ఛేధించారు. ఈ కేసులో కోట్ల రూపాయల విలువచేసే సెల్ ఫోన్లను రికవరీ చేశారు. అంతరాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్ట చేశారు.
తెలంగాణలో రాజ్యాంగం, పరిపాలన వ్యవస్ధల్లో ఏర్పడిన జాప్యం కారణంగా సామాన్య ప్రజలు సతమతమౌతున్నారు. అసెంబ్లీ నుండి రాజ్ భవన్ కార్యాలయంకు చేరిన పరిపాలన బిల్లుల ప్రక్రియ గవర్నర్ ఆమోద ముద్ర దగ్గర ఆగిపోయాయి.
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అన్ని రకాల సివిల్ కేసులు మరియు కాంపౌండబుల్ క్రిమినల్ కేసుల పరిష్కారం కోసం నవంబర్ 12న తెలంగాణలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తుంది
మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్కు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుల దర్యాప్తు పై విధించిన స్టే ఎత్తివేసింది. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని కోర్టు ఆదేశించింది.
దేశంలో విధ్వంసకర, మతోన్మాద పాలన సాగిస్తోన్న ప్రధాని మోదీకి సీఎం జగన్ స్వాగతం పలకడం ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నించారు.