Home / ప్రాంతీయం
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్ గురువారం ప్రమాణస్వీకారం చేసారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో ప్రమాణం చేయించారు.
నటుడు అలీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ని కలిశారు. వివాహ ఆహ్వాన పత్రిక ప్రతిని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కి అందిస్తూ స్వయంగా వివాహానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ సర్కార్ పరోక్షంగా కక్ష సాధింపులకు దిగుతోంది. ఇటీవల రోడ్డు విస్తరణ కోసం ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత వివాదాస్పదంగా మారడం. బాధితులకు పవన్ అండగా నిలిచి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నెల 12న విశాఖకు రానున్న ప్రధానమంత్రి మోది పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యన్నారాయణ వైఎస్ఆర్సీపి శ్రేణులకు పిలుపునిచ్చారు.
పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో నేడు టమోట ధర అమాంతం పడిపోయింది. కిలో ధర 0.50పైసలు పలకడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ముసాయిదా ఓటర్ల జాబితాను చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. నవంబర్ 9 నాటికి నకిలీ ఓటర్లు, మృతులు, ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన 10,52,326 ఓట్లను ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా తొలగించిన్నట్లు సీఈవో వెల్లడించారు.
జనసేన మరోసారి జగన్ సర్కార్‌పై డిజిటల్ సమరం ప్రారంభించింది. ఈ నెల 12,13,14 తేదీల్లో జగనన్న కాలనీ ఇళ్లు, టిడ్కో ఇళ్ల పై జనసేన సోషల్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది.
తెలంగాణలో సంచలన సృష్టించిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు.
రాజ్ భవన్ - ప్రగతి భవన్ ల మద్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో తెరాస ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.