Last Updated:

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ టీంకి మరో షాక్నా – 4 రోజుల్లోనే టీవీల్లో ప్రసారమైన సినిమా, నిర్మాత అసహనం

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ టీంకి మరో షాక్నా – 4 రోజుల్లోనే టీవీల్లో ప్రసారమైన సినిమా, నిర్మాత అసహనం

Game Changer Movie Telecast in Local TV: గేమ్ ఛేంజర్ మూవీ టీంకి మరో చేదు అనుభవం ఎదురైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినా తొలి రోజు ఈ సినిమా రూ.186 పైగా కోట్ల గ్రాస్ చేసింది. అయితే కలెక్షన్స్ విషయంలో మూవీ టీం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు గేమ్ ఛేంజర్ ను సినిమాను మొదటి నుంచి పైరసీ వెంటాడుతుంది. చిత్రీకరణ దశలోనే ఎన్నో సార్లు సెట్స్ లోని ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. ఇక రిలీజ్ కు ముందు కూడా మూవీ లీక్ చేస్తామంటూ ఓ ముఠా నుంచి మూవీ టీం బెదిరింపులు ఎదుర్కొంది.

తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సినిమాను లీక్ చేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చినట్టు నిర్మాతలు సైబర్ క్రైం పోలీసులు ఆశ్రయించారు. అంతేకాదు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో లీక్ చేసిన ఆధారాలను కూడా మూవీ టీం సైబర్ క్రైం పోలీసులకు ఇచ్చింది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతుంది. ఈ క్రమంలో మరోసారి గేమ్ ఛేంజర్ టీం షాకింగ్ ఇన్సిడెంట్ ఎదురైంది. మూవీ విడుదలై నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే గేమ్ ఛేంజర్ టీవీల్లో ప్రదర్శించారు. పలు లోకల్ ఛానల్లో గేమ్ ఛేంజర్ మూవీ ప్రసారమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీనిపై బేబీ నిర్మాత ఎస్కేన్ స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు. ‘ఇది ఏమాత్రం సహించదగినది కాదు. సినిమా విడుదలై వారం రోజులు కూడా కాలేదు లోకల్ కెబుల్ ఛానల్, బస్సులో ప్రదర్శించడం తీవ్ర ఆందోళన కలిగించే చర్య. సినిమా అంటే కేవలం హీరో, డైరెక్టర్, నిర్మాతలకు మాత్రమే సంబంధించింది కాదు. దీనిక వెనక ఎంతోమంది మూడేళ్ల కష్టం ఉంది. వారి అంకితభావం, వేలాది మంది శ్రమ దాగి ఉంది. ఈ సినిమా విజయంపై ఆధారపడ్డ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పై దీని ప్రభావం ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి చర్యలు వారి కష్టాన్ని దెబ్బతీయడమే కాదు.. చిత్ర పరిశ్రమకు కూడా మంచిది కాదు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండ ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది. సినిమాని రక్షించడానికి, ఇండస్ట్రీ భవిష్యత్తు కోసం మనందరం ఐక్యంగా నిలబడి పోరాడుదాం’ అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చారు. అంతేకాదు సేవ్ ది సినిమా(#savethecinema) అంటూ హ్యాష్ ట్యాగ్ జతచేశాడు.