Home / ప్రాంతీయం
ఉపాధి హామీ పథకం నిధులు దారి మళ్లించారని ఆరోపిస్తూ తెలంగాణ సర్కారుకు కేంద్రం నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేటి నుంచి ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ ను ఇంటి నుంచి బయటకు రావద్దంటూ గృహనిర్బంధం చేశారు పోలీసులు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి తమ ముందు విచారణకు హాజరుకావాలని మల్లారెడ్డి సహా 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ విచారణకు ఆయన దూరంగా ఉన్నారు.
వాల్మీకి, బోయ, బెంతు కులాలను ఎస్టీల్లో చేర్చవద్దని గత కొంతకాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. దానితో జగన్ నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
లంగాణలో మాంసం వినియోగం విపరీతంగా పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో అత్యధికంగా మాంసాహారం వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
తెలంగాణలోని మరో రెండు చారిత్రక కట్టడాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కుతుబ్షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోటకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు లభించాయి.
మెట్రో ప్రయాణికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రెండో ఫేజ్ పనులకు సంబంధించి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు.
తెలంగాణలో పోలీస్ అభ్యర్థులకు శుభవార్త. పోలీస్ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 8 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ మేజర్మెంట్ (PMT), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PET) నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి ప్రకటించింది.
ఇప్పటంలో ఇళ్ల కూల్చి తన గుండెళ్లో గునపం దింపారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తాం అని సవాల్ విసిరారు. కూల్చివేతలో అధికారులు పద్ధతి పాటించలేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం తనను బాధించిందని ఆయన తెలిపారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం నుంచి నిర్మల్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర చేయనున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు పాదయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు 114 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.