Home / ప్రాంతీయం
నిన్నమొన్నటి వరకు మంచి ధర పలికిన టమాట ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయింది. రెండంకెల్లో ఉన్న ధర ఇప్పుడు రెండు రూపాయలకు పడిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
ప్రగతిభవన్ వద్ద హైడ్రామా నెలకొంది. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న షర్మిల కాన్వాయ్ పై తెరాస కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ ధ్వంసమైన కారులో భారీ కాన్వాయ్‌తో నేడు ప్రగతిభవన్ ముట్టడికి షర్మిల యత్నించారు. దానితో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సోమాజిగూడ వద్ద షర్మిలను అడ్డుకుని అరెస్ట్ చేశారు.
తెలంగాణలో ట్రాన్స్ జెండర్లు చరిత్ర సృష్టించారు. ప్రభుత్వ కొలువులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రాచి రాథోడ్, కొయ్యల రుత్ జాన్ పాల్ ఇద్దరు లింగ మార్పిడి చేయుకున్నవారు.
ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని శిక్షలు విధించిన కామాంధులు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. చిన్నాపెద్ద తేడాలేకుండా పసి పిల్లలనుంచి పండు ముసలి వాళ్లపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. రోజూ ఏదో ఒక మూల ఎంతోమంది బాలికలు, మహిళలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది.
వివాహం అన్నాక విందు కామన్. కొంతమంది అయితే పెళ్లిళ్లలో విందులో వడ్డించే ఐటమ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. అయితే వివాహ విషయంలో ఒక్కోదగ్గర ఒక్కో సంప్రదాయం ఉంటుంది. కాగా తాజాగా ఓ పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదన్న కారణంతో మగ పెళ్లివారు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ను అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద షర్మిలను అరెస్ట్ చేశారు.
ర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో షర్మిల బస్సుపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేసి నిప్పుపెట్టారు.
బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది.
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును ధర్మాసనం తప్పుబట్టింది
భాగ్యనగరంలో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినంగా అమలుచేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.