Home / ప్రాంతీయం
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యార్థిని తపశ్వి అనే యువతిపై ఓ యువకుడు సర్జికల్ బ్లేడుతో దాడి చెయ్యగా ఆ యువతి మృతి చెందిది.
తెదేపా నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ ఫిరాయింపులపై క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా ఆయన వైకాపా గూటికి చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ‘తిమింగలం’వాలింది. ఒకరోజంతా అక్కడే సేదతీరి.. తిరిగి సోమవారం రాత్రి ఎగిరిపోయింది. సముద్రంలో ఉండాల్సిన తిమింగలం ఎయిర్పోర్టులో ఉండడమేంటా అనే కదా మీ సందేహం నిజమేనండి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమాన తిమింగలం.
తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీఎల్ సంతోష్ తో పాటు, జగ్గు స్వామికి హైకోర్టులో ఊరట లభించింది.
"సైకో పోవాలి సైకిల్ రావాలని" రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు స్థాపించిన స్కిల్ డెవల్పెమెంట్ సెంటర్స్ విషయంలో స్కాం జరిగిందంటూ ఈడీ ఎంక్వైరీ చేపట్టడం ఏంటంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని సజ్జల ఖండించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని సజ్జల స్పష్టం చేశారు. ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరినీ తొలగించబోవడంలేదని అన్నారు.
త్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ నివాసంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడిపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు నాటి బీహార్ ను తలపిస్తుందంటూ విమర్శించారు.
ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లాలో జరిగిన ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.