Home / ప్రాంతీయం
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాంపై ఈడీ దృష్టి సారించింది. దీనిలో భాగంగా రూ.234 కోట్ల నిధుల మళ్లింపునకు సంబంధించి కేసు నమోదు చేసింది. ఈ మేరకు విచారణకు హాజరుకావాలంటూ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ గంటా సుబ్బారావులతో పాటు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసింది.
రాష్ట్రంలో వైసీపీ పాలనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ పర్యటనపై రాష్ట్రంలో కొనసాగుతున్న ఆంక్షలపై జనసైనికులు మండిపడుతున్నారు. పవన్ ప్రజలను కలుసుకోకుండా ఎందుకు రాష్ట్రప్రభుత్వ నేతలు ఇంతగా ఆంక్షలు పెడుతున్నారు అనేది పలువురి ప్రశ్న. మరి దీనిపై ఈ ప్రత్యేక కథనం చూసేద్దామా..
తెలుగు భాష, తెలుగు సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న రాష్ట్రపతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.
ఏపీలో సంచలనం సృష్టించిన సంకల్ప్ సిద్ధి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
సర్వసాధారణంగా ఏటీఎం అంటే డబ్బులు వచ్చే మెషీన్ అని మనకు తెలిసిందే. కాగా పెరుగుతున్న అధునాతన సాంకేతికతో పలురకాల ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. కాగా ఈ టెక్నాలజీ మరింత అడ్వాన్స్డ్ అయ్యి ఇప్పుడు ఏకంగా బంగారాన్ని కూడా ఇచ్చే ఏటీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. భారతదేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంను శనివారం హైదరాబాద్ బేగంపేటలో ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా పలు రూట్లలో వందేభారత్ రైళ్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు దక్షిభారతం అందులోనూ తెలంగాణ ఆంధ్రా మధ్య కూడా ఓ రైలు పరుగులు పెట్టనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ నిర్ధారించారు.
హైదరాబాదులోని శిల్పకళావేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం తాను ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ కిందే లెక్క అని వెల్లడించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికను ఆమె బాబాయి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ ఘటన బాలానగర్ మండలం తిరుమలగిరిలో చోటుచేసుకుంది, బాలికపై వరుసకు బాబాయ్ అయ్యే వక్తి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి గ్యాంగ్ చేశాడు.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం(డిసెంబరు 3) సందర్భంగా తెలంగాణ కీలక నిర్ణయం తీసుకుంది. స్త్రీ, శిశు సంక్షేమశాఖలో భాగంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమశాఖ విభాగాన్ని మంత్రిత్వ శాఖగా ఏర్పాటుచేసేందుకు నిర్ణయించింది.
సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. విద్యార్దులను బిడ్టల్లా చూసుకోవలసిన అధ్యాపకుడే కీచకుడిగా మారాడు.