Home / ప్రాంతీయం
MLA Raghunandan Rao: సీఎం కేసీఆర్ పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(MLA Raghunandan Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. మియాపూర్ లోని రూ. 4 వేల కోట్ల విలువైన భూములను.. తోట చంద్రశేఖర్ కు అప్పగించారని ఆరోపించారు. సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే మియాపూర్ భూ స్కాం జరుగుతోందన్నారు. BRS అంటే బీహార్ రాష్ట్ర సమితి అని .. కేసీఆర్ బీహారీ.. ఆయనకు బీహార్ కు చెందిన సోమేశ్ కుమార్ పైన ప్రేమ ఎక్కువ అని ఎద్దేవా […]
Actor Ali: సినీ నటుడు , ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ సంచలన ప్రకటన చేశారు. వైఎస్ జగన్ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఎక్కడి నుంచైనా పోటీకి తాను రెడీ అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని జోస్యం చెప్పారు. జగన్ ఆదేశిస్తే ఏదైనా చేస్తా తాజాగా తిరుపతి లోని నగరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2024 […]
IND vs NZ ODI: భారత్ – న్యూజిలాండ్ వన్డే మ్యాచ్(IND vs NZ ODI) కోసం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్దమైంది. ఇరుజట్ల మధ్య రేపు (జనవరి 18) జరిగే మ్యాచ్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. దాదాపు 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతి ఇస్తామని చెప్పారు. […]
NTR-Team India:న్యూజిలాండ్ తో జరిగే మెుదటి వన్డేకు హైదరాబాద్ వచ్చిన భారత్ ప్లేయర్లు సందడి చేశారు. కాస్త సమయం దొరకడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీమిండియా ప్లేయర్లను కలిశాడు. సోషల్ మీడియాలో దీనికి సంబధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్.. టీమిండియా ప్లేయర్లు సరదాగా సందడి చేశారు. దీంతో అటు ఎన్టీఆర్ అభిమానులు.. ఇటు క్రికెట్ అభిమానులు ఈ ఫోటోలను చూసి మురిసిపోతున్నారు. ఈ ఫోటోలను చూస్తూ.. ఎన్టీఆర్ క్రేజ్ ఇది […]
Medak: మెదక్ లో ఓ వ్యక్తి బీమా డబ్బుల కోసం ఆడిన డ్రామాను చూసి పోలీసులు కంగుతిన్నారు. చనిపోయాడు అనుకున్న వ్యక్తి గోవాలో ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వ్యక్తి సజీవదహనం కేసు కీలక మలుపు తిరిగింది. బీమా డబ్బుల కోసమే డ్రైవర్‌ను వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం […]
Mukarram Jah: చివరి నిజాం రాజు.. ముఖరంజా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. శనివారం రాత్రి చివరి నిజాం మరణించినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. చివిరి నిజాం Nizam Family మృతదేహాన్ని మంగళవారం ఇస్తాంబుల్ నుంచి హైదరాబాద్ కు తీసుకురానున్నారు. అక్కడి నుంచి సాయంత్రం చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకెళ్తారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణ ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. సాయంత్రం మక్కా మసీదులో ప్రార్థన […]
Black Tickets: హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య మెుదటి వన్డే మ్యాచ్ రేపు జరగనుంది. దీంతో అభిమాన క్రికెటర్ల ఆట చూసేందుకు.. క్రికెట్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక ఉప్పల్ లో నాలుగేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించారు. ఈసారి ఆన్ లైన్ లో టికెట్లు.. భారత్ -న్యూజిలాండ్ మెుదటి వన్డే టికెట్లను హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ పేటీఎం ద్వారా […]
Hyderabad: మలక్ పేట్ బాలింతల మృతి కేసులో నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాలింతల మృతికి బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ కారణమని వైద్యులు నిర్దారించారు. మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటీవలే ఇద్దరు బాలింతలు Two infants died మృతి చెందారు. మృతికి కారణం ఇదే.. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన సిరివెన్నెల.. తిరుపతికి చెందిన మరో మహిళా శివాణి ఇద్దరు ఏరియా ఆస్పత్రిలో కాన్పు చేయించుకున్నారు. అదే రోజు ఈ ఆస్పత్రిలో మరో తొమ్మది మంది కాన్పు చేయించుకున్నారు. […]
Suicide:హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. హైదరాబాద్ లోని తార్నాకలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో ఓ చిన్నారి ఉండటం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఆత్మహత్యకు కారణం ఇదే.. ఈ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు వివరించారు. తార్నాకలో నివాసం ఉంటున్న విజయ్ ప్రతాప్, సింధూర దంపతులు. వీరికి నాలుగేళ్ల పాప ఆద్య ఉంది. వీరితో పాటు […]
Khammam: బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభకు.. ఖమ్మం వేదికైంది. ఈ సభ కోసం బీఆర్ఎస్ భారీగా ఖర్చు చేస్తోంది. బీఆర్ఎస్ ఆవిర్భావ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభకు కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇక సభాస్థలి వేదికను సర్వాంగ సుందరంగా తయారు చేస్తున్నారు. దీంతో ఖమ్మం (Khammam) మెుత్తం గులాబీమయంగా మారిపోయింది. దారులన్నీ ఖమ్మం వైపే భారాస ఆవిర్భావ సభకు ఖమ్మం ముస్తాబైంది. ఈ వేదికను బీఆర్ఎస్ శ్రేణులు సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. […]