Home / ప్రాంతీయం
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాననడం బాధాకరమని వల్లభనేని వంశీ అన్నారు.
Hyderabad Murder: ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. నవీన్‌ను హత్య చేసిన అనంతరం హరిహర కృష్ణ.. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. పోలీసుల విచారణలో నేరాన్నీ అంగికరించినట్లు తెలుస్తోంది.
ఇకపై గ్రూప్ 2 , గ్రూప్ 3 ఉద్యోగాల నియామకానికి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టు (సీపీటీ) సర్టిఫికెట్ తప్పనిసరి కానుంది.
Nandyal Murder: ఆంధ్రప్రదేశ్ లో పరువు హత్య కలకలం రేపింది. కన్న కూతురినే తండ్రి దారుణంగా హత్య చేశాడు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూతురు గొంతు కోసి.. దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ బాబాయ్.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలుగు రాష్ట్రాలలో ఎంతటి సంచలనంగా మరిందో అందరికీ తెలిసిందే. కాగా 2019 మార్చి 15న ఆయన ఇంట్లోని బాత్రూమ్లోనే వైఎస్ వివేకానంద రెడ్డిని దుండగులు దారుణంగా నరికి చంపారు.
Hyderabad Murder: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని ఓ యువకుడు స్నేహితుడినే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ హత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ నెల 17న హత్య జరగగా.. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో సీఐడీ అధికారులు రెండో రోజు సోదాలు కొనసాగిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంత భూవివాదానికి సంబంధించిన కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ అధికారులు.. హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లిలోని నారాయణ కుమార్తె నివాసాలపై శుక్రవవారం సోదాలు నిర్వహించారు.
వరంగల్ కాకతీయ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యాయత్నం మరువక ముందే.. నిజామాబాద్ లో మరో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ లోని తన గదిలో ఉరి వేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలానికి చెందిన హర్హ బలవన్మరణం పాలయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ వైద్యరంగ చరిత్రలో మణిపాల్ హాస్పటిల్ విజయవాడ మరో అరుదైన ఘనత సాధించింది. కేవలం ఒక్క ఏడాది లోనే అత్యంత క్లిష్టతరమైన కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క సంవత్సరంలో సుమారు 70కి పైగా ఇలాంటి అరుదైన సర్జరీలను నిర్వహించిన ఏకైక హాస్పిటల్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ కావడం గమనార్హం.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కుప్పంలో మొదలైన ఈ యాత్ర ఇప్పుడు తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తిరుపతిలోని యువతతో ముఖాముఖి నిర్వహించారు.