Last Updated:

Manipal Hospitals Vijayawada : కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలతో మణిపాల్ హస్పిటల్ విజయవాడ రికార్డు..

ఆంధ్రప్రదేశ్ వైద్యరంగ చరిత్రలో మణిపాల్ హాస్పటిల్ విజయవాడ మరో అరుదైన ఘనత సాధించింది. కేవలం ఒక్క ఏడాది లోనే అత్యంత క్లిష్టతరమైన కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క సంవత్సరంలో సుమారు 70కి పైగా ఇలాంటి అరుదైన సర్జరీలను నిర్వహించిన ఏకైక హాస్పిటల్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ కావడం గమనార్హం.

Manipal Hospitals Vijayawada : కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలతో మణిపాల్ హస్పిటల్ విజయవాడ రికార్డు..

Manipal Hospitals Vijayawada : ఆంధ్రప్రదేశ్ వైద్యరంగ చరిత్రలో మణిపాల్ హాస్పటిల్ విజయవాడ మరో అరుదైన ఘనత సాధించింది. కేవలం ఒక్క ఏడాది లోనే అత్యంత క్లిష్టతరమైన కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క సంవత్సరంలో సుమారు 70కి పైగా ఇలాంటి అరుదైన సర్జరీలను నిర్వహించిన ఏకైక హాస్పిటల్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ కావడం గమనార్హం. ఇది మాత్రమేకాక మూడేళ్లు, అంతకంటే తక్కువ వయసు కలిగిన చిన్నపిల్లలకు బైలాటరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలు పదికి పైగా విజయవంతంగా నిర్వహించిన ఘనత కూడా మణిపాల్ హాస్పిటల్ విజయవాడ దే కావడం విశేషం.

ఈ సంధర్భంగా డా. వీ. వెంకట కృష్ణ సందీప్, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ కన్సల్టెంట్ – ఈఎన్టీ, హెడ్ అండ్ నెక్ సర్జన్ మాట్లాడుతూ.. “ చిన్న పిల్లలకు అతి సున్నితమైన కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించాము. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ సర్జరీలను నిర్వహించడం గౌరవంగా భావిస్తున్నాను. పిల్లలందరికీ కాక్లియర్ ఇంప్లాంటేషన్ చికిత్సను ఉచితంగా అందించాము. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF), డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకం ద్వారా ఇప్పటి వరకు డెబ్బై మందికి పైగా పిల్లలు చికిత్స పొందారు. వీరందరికి పూర్తి స్థాయిలో చికిత్స పూర్తి కాగా.. వారందరూ ఇప్పడు మాట్లాడగలుగుతున్నారు” అని చెప్పారు.

అదే విధంగా ఆడియాలజిస్ట్ శ్రీధర్ జాస్తి మాట్లాడుతూ.. “చాలా మంది పిల్లలు పుట్టుకతోనే వినికిడి సమస్యను కలిగి ఉంటారు. ఫలితంగా తాము ఎప్పటికీ మాట్లాడలేమని మానసికంగా ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారికి మేము పూర్తిస్థాయిలో కౌన్సిలింగ్ ఇస్తాము. కాక్లియర్ ఇంప్లాంటేషన్ గురించి వివరించి.. అవగాహన కల్పిస్తాము. తరువాత ఆ పిల్లలకు మణిపాల్ హాస్పిటల్స్ నుంచి ఉచిత వైద్యం అందిస్తాము. ఇలా మా దగ్గర కాక్లియర్ ఇంప్లాంటేషన్ ను పూర్తి చేసుకున్న పిల్లల్లో వినికిడి సమస్య లేకుండా విని మాట్లాడగలుగుతున్నారు. వారి జీవితంలో ఈ సర్జరీ వెలుగులు నింపింది అని చెప్పవచ్చు.” అని పేర్కొన్నారు.

ఆ విషయంలో ఏపీ లోనే మణిపాల్ హాస్పటల్స్ నెం. 1: మణిపాల్ హాస్పిటల్ డాక్టర్ సుధాకర్

కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ లో మణిపాల్ హాస్పిటల్ (Manipal Hospitals Vijayawada) మొట్టమొదటి స్థానంలో ఉంది. మా వైద్యులు ఇప్పటివరకు 70 మందికి పైగా పిల్లలకు కోక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. ఇంత పెద్ద మొత్తంలో ఈ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడంతో మా హాస్పిటల్ వైద్యులు చరిత్ర సృష్టించారు. ఈ ఘనత సాధించిన డా.వి.వెంకటకృష్ణ సందీప్‌, డాక్టర్‌ అన్నే జయకృష్ణ, శ్రీధర్ జాస్తి లకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.’’ అని మణిపాల్ హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి అన్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/