Last Updated:

APPSC: గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకు అలెర్ట్.. పలు మార్పులు చేసిన ఏపీపీఎస్సీ

ఇకపై గ్రూప్ 2 , గ్రూప్ 3 ఉద్యోగాల నియామకానికి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టు (సీపీటీ) సర్టిఫికెట్ తప్పనిసరి కానుంది.

APPSC: గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకు అలెర్ట్.. పలు మార్పులు చేసిన ఏపీపీఎస్సీ

APPSC: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ లో పలు మార్పులు చోటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల నియామకాల విధానం లో పలు మార్పులు జరిగాయి. ఇకపై గ్రూప్ 2 , గ్రూప్ 3 ఉద్యోగాల నియామకానికి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టు (సీపీటీ) సర్టిఫికెట్ తప్పనిసరి కానుంది.

అడహాక్ నిబంధనలు జారీ(APPSC)

ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా మండలి నిర్వహించే సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసుల్లో నియామకానికి అవకాశం లేదంటూ అడహాక్ నిబంధనలు జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా సీపీటీ పాస్ అవ్వాలని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.

సీపీటీ పాస్ కావాల్సిందే..

కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టు.. 100 మార్కులకు నిర్వహించనున్నట్టు సాధారణ పరిపాలన ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగు అభ్యర్థులు కనీసం 30 మార్కులు, బీసీలు 35 మార్కులు, ఓసీ లు 40 మార్కులు సాధించాల్సి ఉంటుందని పరిపాలనా శాఖ సెక్రటరీ పోలా భాస్కర్ తెలిపారు.

ఈ టెస్టులో కంప్యూటర్స్, డిజిటల్ పరికరాలు, వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టమ్ లు , విండోస్, ఇంటర్నెట్ లాంటి అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అయితే గ్రూప్ 1 ఉద్యోగాలకు ఈ టెంపరరీ నిబంధనలు వర్తించవని తెలిపారు. కాబట్టి ఇకపై ఏపీపీఎస్సీ లో గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టు ను ఖచ్చితంగా పాస్ కావాల్సి ఉంటుంది.