AP Home Minister Anitha: గుడ్ న్యూస్.. 10వేల కానిస్టేబుల్ పోస్టులు.. భర్తీ ఎప్పుడంటే?

AP Home Minister Anitha announced police jobs: ఏపీలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపడుతామని హోం మంత్రి వంగలపూడి వనిత అసెంబ్లీలో వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇందులో భాగంగానే తొలుత 6,100 పోస్టుల నియామకం పూర్తవుతుందని వెల్లడించారు. మిగిలిన 10,762 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు హోం మంత్రి చెప్పారు.
ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొదలుపెడుతామన్నారు. అలాగే పోలీస్ వెల్ఫేర్ విషయంపై ఆమె ప్రస్తావించారు. అనుకోని ప్రమాదాల్లో పోలీసులు చనిపోతే రూ.10 నుంచి రూ15 లక్షల వరకు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన వెల్లడించారు.
అంతకుముందు వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా సంతకాలు చేయడంపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశాడు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారా అని అసెంబ్లీలోనే సభ్యులను ప్రశ్నించారు. ఓ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గౌరవంగా సభకు హాజరుకావాలని సూచించారు. అంతేకానీ ఎవరికీ కనబడకుండా వైసీపీ సభ్యులు వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని అన్నారు. ఇలా చేయడం మంచిదేనా? అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేశారు.