Last Updated:

AP High Court : ఇప్పటం పిటిషనర్లకు మరోసారి షాక్ ఇచ్చిన హైకోర్టు

గుంటూరు జిల్లా ఇప్పటం వాసులకు ఏపీ హైకోర్టులో బుధవారంనాడు మరోసారి చుక్కెదురైంది. ఇప్పటం వాసులకు విధించిన జరిమానాను తగ్గించాలని కోరుతూ

AP High Court : ఇప్పటం పిటిషనర్లకు మరోసారి  షాక్ ఇచ్చిన హైకోర్టు

AP High Court : గుంటూరు జిల్లా ఇప్పటం వాసులకు ఏపీ హైకోర్టులో బుధవారంనాడు మరోసారి చుక్కెదురైంది. ఇప్పటం వాసులకు విధించిన జరిమానాను తగ్గించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు బుధవారంనాడు తిరస్కరించింది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇప్పటంలో అక్రమ నిర్మాణాల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను 14 మందికి ఏపీ హైకోర్టు లక్ష రూపాయాల చొప్పున జరిమానాను విధిస్తూ ఏపీ హైకోర్టు ఈ ఏడాది నవంబర్ 23న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ జరిమానాను తగ్గించాలని కోరుతూ పిటిషనర్లు ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ ను దాఖలు చేశారు. పిటిషనర్ల ఇళ్లను కాపాడుకోవాలన్న ఉద్దేశ్యమని న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్లు అంతా రైతులే వాళ్లకు తెలియక తప్పు చేశారని ధర్మాసనానికి తెలిపిన పిటిషనర్ల తరపున న్యాయవాది కోర్టుకు తెలియజేసారు. వాళ్లకు తెలియకపోతే మీరు చదువుకున్న వారే గా మీకు తెలియదా అని పిటిషన్ల తరఫున న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.ఇలాంటి వ్యవహారాలను సహించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృధా చేయటం మంచిది కాదంటూ ధర్మాసనంరిట్ అప్పీలును కొట్టేసింది.

ఇప్పటంలో తమ పార్టీ సభ ఏర్పాటు చేసుకొనేందుకు స్థలం ఇచ్చినందుకే కక్షపూరితంగా వ్యవహరించి ఇప్పటంలో ఇళ్లను కూల్చివేశారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఆర్ధిక సహాయం అందించారు.

ఇవి కూడా చదవండి: